GK Telugu Meeku Telusa

Alluri Seetha Rama Raju Mystory | అల్లూరి సీతా రామ రాజు ఏమైపోయారు

 భారతదేశ చరిత్రలో సుభాష్ చంద్రబోస్ మరణం ఇప్పటికీ చర్చానీయాంశంగానే ఉంది. అలాగే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు మరణం కూడా ఇంకా ప్రశ్నార్థకంగా మిగిలింది. వాస్తవానికి అల్లూరి చనిపోయినట్టు ఏ రికార్డ్స్‌లోనూ నమోదు కాలేదని, అల్లూరి అనుచరుడు చనిపోతే అల్లూరి సీతారామరాజే చనిపోయినట్టు బ్రిటిష్‌ అధికారులు పొరపాటుగా గుర్తించారనే వాదనలు ఉన్నాయి. 

దీంతో అల్లూరి సీతా రామ రాజు ఏమైపోయారు ఆయన నిజంగానే మరణించారా ఇప్పటికి ఆయన మరణం ఎవరికీ తెలియని  ఓ మిష్టరీగానే మిగిలి పోయింది. .

భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తనకంటూ ఒక గొప్ప అధ్యాయాన్ని లికించుకున్న మన్యం వీరుడు అల్లూరి సీతా రామరాజు . బ్రిటిష్ అధికారుల గుండెల్లో దడ పుట్టించి, పుట్టిన గడ్డకోసం 27 ఏళ్లకే ప్రాణాలు అర్పించిన త్యాగమూర్తి. గిరిజన పల్లెవాసుల మేలు కోసం తెల్ల దొరలతో పోరాడాడు. చరిత్ర శిలా ఫలకం పైన మన్యం వీరుడుగా నిలిచిపోయాడు. 

భారత స్వాతంత్య్రం కోసం మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో పోరాటాలు సాగుతున్న కాలంలోనే దానికి సమాంతరంగా అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో తూర్పు గోదావరి జిల్లాలోని అటవీ ప్రాంతంలో పెద్ద ఉద్యమం సాగింది. రంప అటవీ ప్రాంతంలో 1922- 1924 ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు నేతృత్వంలో మన్యం విప్లవం సాగింది. 

ఈ ఉద్యమమే బ్రిటిషు నాయకుల్లో నిద్ర లేకుండా చేసింది. రాంప అటవీ ప్రాంతంలో బ్రిటిష్ వారు తమ చట్టాలతో, ఆంక్షలతో గిరిజనులను అన్ని రకాలుగా దోచుకొనేవారు. ఇదంతా చుసిన అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ అధికారులపైనా విరుచుకుపడ్డాడు. గిరిజనులకు ఉండే హక్కులను వారికీ వివరించి తెల్లదొరలను ఎదిరించే స్థాయికి వారిని చైతన్య పరిచాడు. సాయుధ పోరాట విప్లవ పంధాలో విప్లవ దళాలు ఏర్పాటు చేసి పోలీస్ స్టేషన్లపైన మెరుపు దాడులు చేశాడు. తన పోరాటం తో బ్రిటిష్ అధికారులను గడగడ లాడించాడు. 

అల్లూరి సీతారామరాజు ఉద్యమాన్ని ఆపలేని అధికారులు అతనిపైన రకరకాల పుకార్లను పుట్టించారు. అల్లూరికి దుష్ట శక్తులు ఉన్నాయని వదంతులు వ్యాపింప చేశారు.  అయినా ఉద్యమం ఆగకపోవడంతో బ్రిటిష్ అధికారులు, పోలీసులు ప్రజలను బందించి హింసించేవారు. 

దీంతో తనకోసం ప్రాణాలు విడిచే  అమాయక గిరిజనులను కాపాడుకోవడానికి అల్లూరి సీతారామ రాజు తనకు తానె అధికారులకు లొంగిపోవాలని నిశ్చయించు కున్నాడు. తాను ఎక్కడున్నాడో బ్రిటిష్ వారికీ తెలియచేశాడు. నేరుగా వచ్చిన బ్రిటిష్ అధికారులు, పోలీసులు 1924 మే 7 వ  తారీఖున అల్లూరి  సీతా రామరాజు ని బంధించారు అలా బంధించిన అధికారులు చివరికి ఆయనను ఏం చేశారు అన్నది ఇప్పటికి ఎవరికీ తెలియాని  మిస్టరీ గానే మిగిలి పోయింది

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!