Self Employment

మిషనరీ అవసరం లేకుండా ఇంట్లోనుండి నెలకు 60,000 అద్భుతమైన వ్యాపారం క్లౌడ్ కిచెన్ బిజినెస్

ఒకప్పుడు ఫుడ్ బిజినెస్ పెట్టాలంటే మంచి లొకేషన్ చూసుకోవాలి . అక్కడ అవసరమైన అన్ని వసతులు ఉండాలి ఇవన్నీ సమకూర్చుకోవడం చాలా కష్టం . అయితే వీటన్నింటికీ బదులుగా ఈ మధ్యకాలంలో మొదలైన బిజినెస్ క్లౌడ్ కిచెన్ బిజినెస్ . తక్కువ పెట్టుబడితో పెద్దగా నష్ట భయం  లేకుండా..మీరు పట్టణ ప్రాంతాల్లో వ్యాపారం చేయాలని భావిస్తున్నట్లయితే క్లౌడ్ కిచెన్ బిజినెస్ మంచి ఐడియా. చిన్న పెట్టుబడి తో మీ ఇంట్లోనే ఈ వ్యాపారం మొదలు పెట్టుకోవచ్చు . 

క్లౌడ్ కిచెన్ వ్యాపారం చేయడానికి ఎంత పెట్టుబడి కావాలి,ఏమేం అవసరం..? ఈ వ్యాపారంలో సమస్యలేంటి..? ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో ఈ బిజినెస్ లో లాభాలు ఎలా ఉంటాయి….

Telegram Group Join Now
WhatsApp Group Join Now
WhatsApp Channel Subscribe Now

క్లౌడ్ కిచెన్ బిజినెస్ అంటే ఏమిటి. 

ఈ మధ్య కాలంలో ఆన్లైన్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం బాగా పెరిగింది దీంతో క్లౌడ్ కిచెన్ వ్యాపారం బాగా ఊపందుకుంది. క్లౌడ్ కిచెన్ వ్యాపారం అంటే కస్టమర్లకు కూర్చోవడానికి సీట్లు , దానికోసం పెద్ద స్థలం ఇవన్నీ అవసరం ఉండదు. అసలు ఈ బిజినెస్ లో కస్టమర్లు మీ వద్దకు రారు. కిచెన్ లో మీరు తయారు చేసిన ఫుడ్ ని ఆన్లైన్ ఆర్డర్ ద్వారా కస్టమర్లకు సప్లై చేయడమే క్లౌడ్ కిచెన్ బిజినెస్ అంటే. 

రీసెర్చ్ చేయాలి…..

 క్లౌడ్ కిచెన్ బిజినెస్ ప్రారంభించడానికి ముఖ్యమైంది రీసెర్చ్. అంటే మీరు ఉండే ఏరియా లో ఎలాంటి ఫుడ్ కి డిమాండ్ ఉంది.  ఆ ఏరియాలో ఉన్న జనాల ఇష్టాఇష్టాలు,  ఆహారపు అలవాట్లు, ఇప్పటికే ఎలాంటి ఫుడ్ ఎంత ధరలో అందుబాటులో ఉంది. మీరు ఆ ఏరియాలో ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే డిమాండ్ ఎలా ఉంటుంది… ఇలాంటి చాలా వివరాలు తెలుసుకోవాలి . 

ఉదాహరణకు హైదరాబాద్‌లోని అమీర్‌పేట లాంటి ఏరియాలో ఇలాంటి బిజినెస్ చేయాలంటే.. అక్కడ ఎక్కువగా ఉండేది యువత కాబట్టి వారు ఎలాంటి ఆహారాన్ని ఎక్కువగా తినడానికి ఇష్టపడుతున్నారో తెలుసుకోవాలి. అలాంటి ఆహారాన్నే మీరు రుచికరంగా, నాణ్యంగా, తక్కువ ఖర్చులో అందించే ప్రయత్నం చేయాలి.

కస్టమర్లకు ఎలాంటి ఆహారం అందించాలనే విషయంలో ఒక క్లారిటీ ఉండి.. మంచి చెఫ్, ఆకట్టుకునే ప్యాకేజింగ్, చక్కటి మార్కెటింగ్ వ్యూహాలను అమలు చేస్తే.. స్వల్ప కాలంలోనే మీ కంటూ ఓ బ్రాండ్ క్రియేట్ అయ్యి ఈ బిజినెస్ లో మంచి లాభాలు సొంతం చేసుకోవచ్చు..

ఈ బిజినెస్ కోసం జనం రద్దీగా ఉండే ప్రాంతానికి దగ్గరగా,  తక్కువ అద్దెకు లభించేలా ఒక 500 చదరపు అడుగుల స్థలం ఉన్న చిన్న గది ఈ క్లౌడ్ కిచెన్ బిజినెస్ కు సరిగ్గా సరిపోతుంది. అలాగే జొమాటో, స్విగ్గీ డెలివరీ ఆప్షన్స్ ఉండేలా డెలివరీ చేయడానికి వచ్చే డెలివరీ పర్సన్స్ వాళ్ళ బైక్స్ నీ పార్కింగ్  చేసుకోవడానికి కూడా స్థలం ఉండేలా చూసుకుంటే బెటర్.

పెట్టుబడి ఎంత అవసరం 

ఈ క్లౌడ్ కిచెన్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీరు ఎంత మొత్తంలో ఫుడ్ సప్లై చేయాలనుకుంటున్నారు అనే దాన్నిబట్టి క్లౌడ్ కిచెన్ వ్యాపారం కోసం ఓవెన్లు, బర్నర్లు, వంటపాత్రలు, రా మెటీరియల్ మొదలైనవి కొనుగోలు చేయాలి. లేదంటే ఇప్పటికే నడుస్తోన్న క్లౌడ్ కిచెన్‌ను అద్దెకు తీసుకొని.. దాన్ని మీ అవసరాలకు అనుగుణంగా మార్చుకోవచ్చు. దీనికోసం 80 వేల నుంచి లక్ష రూపాయల వరకూ ఖర్చవుతుంది. 

 మీరు కాస్త పెద్దదిగా ఈ వ్యాపారం చేయాలి అనుకుంటే మాత్రం కమర్షియల్ గ్యాస్ కనెక్షన్ కమర్షియల్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కూడా తప్పనిసరిగా తీసుకోవాలి 

క్లౌడ్ కిచెన్ ప్రారంభించే వారికి వంట చేయడం తో పాటు,  అకౌంటింగ్,  మార్కెటింగ్ , ముడిపదార్థాల కొనుగోలు తదితర అంశాల్లో కనీస అవగాహన ఉండాలి . అంటే అవి ఎక్కడెక్కడ తక్కువ ధరలకు హోల్సేల్ రూపంలో దొరుకుతాయో ముందుగా చూసుకోవాలి.  హోటల్ లేదా రెస్టారెంట్ వ్యాపారంలో కొంత అనుభవం ఉంటే మరీ మంచిది. 

డెలివరీ ఎలా

ఇక క్లౌడ్ కిచెన్ బిజినెస్ లో అతిపెద్ద అవరోధం డెలివరీ. ఫుడ్ నీ తయారు చేయడం ఒక ఎత్తయితే దానికి కస్టమర్లకు టైం కి అందించడమే పెద్ద సమస్య…. దీనికోసం స్విగ్గి,  జొమాటో ఫుడ్ డెలివరీ ఆప్ లపై ఆధారపడాల్సి ఉంటుంది.  కానీ వాటి ద్వారా డెలివరీ చేయాలనుకుంటే మన ఆదాయంలో వాటికి కూడా కమిషన్లు చెల్లించాలి…. ప్రస్తుతం చాలామంది ఇదే చేస్తున్నారు. అయితే మీరు అలా వద్దు అనుకుంటే మీరే సొంతంగా డెలివరీ బాయ్స్ నియమించుకుని కస్టమర్లకు డెలివరీ చేయొచ్చు 

ఇలా చేయడం వల్ల మార్కెట్లో మీకు ఒక బ్రాండ్ క్రియేట్ అవుతుంది. మీరు తయారు చేసిన ఫుడ్ టెస్ట్ గా, నాణ్యంగా ఉంటూ,, టైం కి కస్టమర్లకు డెలివరీ చేయగలిగితే మీ క్లౌడ్ కిచెన్ బిజినెస్ సూపర్ హిట్ అయినట్లే. 

ప్యాకేజింగ్ కూడా ముఖ్యమే….

క్లౌడ్ కిచెన్ బిజినెస్ లో ఆహారం టేస్ట్ గా ఉండడం ఎంత ముఖ్యమో అంత చక్కగా డెలివరీ చేయడం కూడా ముఖ్యం… అందుకోసం ప్యాకేజింగ్ బాగుండేలా చూసుకోవాలి. అందులోనూ ప్లాస్టిక్ బదులుగా బయోడిగ్రేడబుల్ వస్తువులు వాడితే ఇంకా బెటర్…ప్యాక్ చేసిన ఆహారం బయటకు లీక్ కాకుండా కలుషితమయ్యే ఛాన్స్ లేకుండా జాగ్రత్తగా సీలు ఉండేలా చూసుకోవాలి 

లైసెన్స్ లు వివరాలు

ఇక కంపెనీ రిజిస్ట్రేషన్ తో పాటు ఫుడ్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి FSSAI లైసెన్స్ పొందడం తప్పనిసరి… ఈ లైసెన్స్ తీసుకోవడానికి పెద్ద ఖర్చు ఉండదు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఈ లైసెన్స్ ఎలా తీసుకోవాలో వివరిస్తూ బోలెడన్ని వీడియో లు అందుబాటులో ఉంటాయి. వాటిని చూసి మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. 

దీంతోపాటు ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి.  తర్వాత గూగుల్లో బిజినెస్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే వ్యాపారానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే వీటితో పాటు ముఖ్యంగా జిఎస్టి రిజిస్ట్రేషన్ కూడా తీసుకోవాలి. అయితే మీరు స్విగ్గి, జొమాటో లతో కలిసి పని చేసుకోవాలి అనుకుంటే ఈ జిఎస్టి రిజిస్ట్రేషన్ లేకపోయినా పర్వాలేదు. ఇక పోలీసుల నుంచి NOC తీసుకోవాలి. 

మార్కెటింగ్ ఎలా…

ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ప్రకారం.. వ్యాపారం ఏదైనా సరే సోషల్ మీడియా పేజీ ఉండాల్సిందే. మీరు చేసేది ఫుడ్ బిజినెస్ కాబట్టి.. సోషల్ మీడియా ద్వారా మరింత మంది కస్టమర్లను చేరుకోవాలి అనుకుంటే అందమైన సోషల్ మీడియా పేజీలు, వెబ్‌సైట్‌ను క్రియేట్ చేసుకోండి. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌, ట్విట్టర్‌లలో అకౌంట్ ఓపెన్ చేయాలి. రెగ్యులర్‌గా వాటిలో అప్‌డేట్స్ ఇస్తుంటే.. ఆటోమెటిగ్గా మీ బిజినెస్ గురించి జనాలకు తెలుస్తుంది. సోషల్ మీడియా ద్వారా తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో ఎక్కువ మందికి చేరువ కావచ్చు.

ఆదాయం ఎంత ఉంటుంది…..

మన దేశంలో ఇప్పటికే ఇలాంటి బిజినెస్ లో ప్రముఖ కంపెనీలు అయిన ఫసోస్, బెహ్రోజ్, బాక్స్ 8, టిఫిన్ బాక్స్ , బిరియాని బై కిలో, ఇలాంటి బోలెడన్ని క్లౌడ్ కిచెన్ కంపెనీలు మన దేశంలో క్లౌడ్ కిచెన్ బిజినెస్ లో కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నాయి.  

అయితే ప్రారంభంలో మీరు ఈ బిజినెస్ లో కోట్లు సంపాదించే అవకాశం లేకపోయినా కనీసం వేల రూపాయలు అయినా పక్కగా ఆదాయం కచ్చితంగా సంపాదించుకోవచ్చు. 

ఉదాహరణకు మనం బిర్యానీ బిజినెస్ స్టార్ట్ చేశాం అనుకుంటే ప్రతి బిర్యానీ పై అన్ని ఖర్చులు పోను 20 రూపాయల లాభం వేసుకున్నా రోజుకు 50 నుంచి 100 బిర్యానీలు హోమ్ డెలివరీ ఇవ్వగలిగితే ఒక రోజుకు వెయ్యి నుంచి 2 వేల వరకు ఆదాయం పొందొచ్చు  అంటే నెలకు అన్ని ఖర్చులు పోను 30 వేల నుండి 60 వేల వరకు ఆదాయం పక్కగా సంపాదించుకోవచ్చు. అలాగే మీ ఈ బిజినెస్ పెరిగే కొద్దీ ఆదాయం కూడా పెరుగుతూ వెళుతుంది ఇదంతా మీ ప్లానింగ్ అండ్ మీరు ఇచ్చే సర్వీస్ మరియు మీరు తయారు చేసే ఫుడ్ యొక్క రుచి మరియు నాణ్యత మీద ఆధారపడి ఉంటుంది. 

అయితే మీరు అందించే రుచికరమైన వంటకాలు ప్రతి ఒక్కరికి తెలియడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈ క్లౌడ్ కిచెన్ బిజినెస్ కి మీ ఒపికే మీ మొదటి పెట్టుబడి. 

About the author

Admin

Leave a Comment

error: Content is protected !!