అరుదైన చెట్టే కాక మంచి పరిమళం వచ్చే ఈ గంధపుచెక్క కి ప్రపంచంలో మంచి డిమాండ్ ఉంది. ఈ చందనాన్ని విలువ ఒక కేజీ 5 వేల దాకా ఉంటుంది. అయితే ఈ ఎర్ర ఛందనం చెట్టే ప్రపంచంలో అత్యంత ఖరీదైన చెట్టు అనుకుంటే మాత్రం పొరబాటే. ఎర్ర చందనం కంటే ఖరీదైన చెట్టు మరొకటి ఉంది అదే ఆఫ్రికన్ బ్లాక్ వుడ్.
ఆఫ్రికన్ బ్లాక్ వుడ్ కిలో విలువ ఎంతో తెలుసా అక్షరాలా 800000 పైమాటే.. మీరు విన్నది నిజమే టాంజానియా, ఇథియోపియా, నైజీరియా, కెన్యా సహా మరో 26 ఆఫ్రికా దేశాల్లో ఈ ఆఫ్రికన్ బ్లాక్ వుడ్ లభిస్తుంది
ఈ చెట్టు పూర్తిగా తిరిగేందుకు 7 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది కానీ స సాధారణంగా ఏడు సంవత్సరాలు దాటగానే ఆ చెట్టును పడగొట్టేస్తారు. ఏడేళ్లలో ఆ చెట్టు 13 ఫీట్లు పెరుగుతుంది. అత్యధికంగా ఇది 50 అడుగుల వరకు పెరగగలదు. ఆఫ్రికన్ బ్లాక్ అధిక ధర పలకడానికి ప్రధాన కారణం దీని మన్నిక. దీనితో తయారు చేసిన వస్తువులు సుదీర్ఘకాలంపాటు మన్నుతాయి. బ్లాక్ వుడ్ కి చెదలు, కీటకాలు కూడా పట్టవు.
ఇది ప్రధానంగా క్లార్నెట్, ఓబోస్, బ్యాగ్ పైప్స్ మొదలైన సంగీత పరికరాలు సహా ఫర్నిచర్ తయారు చేయడానికి వినియోగిస్తారు. ఇది మన్నిక లొనే కాదు చూడ్డానికి కూడా చాలా పాలిష్డ్ గా చాలా రిచ్ గా ఉంటుంది. అందుకే ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆఫ్రికన్ బ్లాక్ వుడ్ గా నిలిచింది.
Leave a Comment