Chanakya Niti Meeku Telusa

Chanakya Neeti: ఇలాంటి మగవాణ్ణి వేశ్య కూడా దగ్గరికి రానివ్వదు

చాణక్య నీతి: భార్య నుంచి విడిపోవడం, సొంత మనుషుల నుంచి అవమానాలు ఎదుర్కోవడం, యుద్ధంలో శత్రువు తప్పించుకోవడం దుర్మార్గుడైన రాజుకు సేవ చేయడం, క్రమంగా పనిచేయని మంత్రి వర్గం, పేదరికం.. ఈ ఆరింట్లోట్లో ఏ ఒక్క పరిస్థితిని అనుభవిస్తున్నా.. అంతకంటే నరకం వేరొకటి ఉండదు. నిప్పు లేకుండానే లోపలి నుంచి తగలబడిపోతున్నట్లే లెక్క.

వివరణ: భార్య నుంచి విడిపోయిన భర్త ఒంటరైపోతాడు. ఇరుగుపొరుగు వారు చులకనగా చూస్తారనే బాధతో కుమిలిపోతుంటాడు. నా వాళ్లు అనుకుని తన శక్తినంతా ధారపోసి కష్టపడితే చివరికి వాళ్లంతా కలిసి అవమానిస్తే ఆ బాధ వర్ణణాతీతం. యుద్ధంలో తప్పించుకున్న శత్రువు దెబ్బతిన్న పులితో సమానం ఎప్పుడైనా, ఎలాగైనా దాడి చేయొచ్చు. దానివల్ల కనీసం కంటి మీద కునుకు కూడా పడని ఒతిడిని అనుభవించాలి. దుర్మార్గుడైన రాజు దగ్గర పనిచేస్తుంటే.. ఆ రాజు చేసే ప్రతి అకృత్యాన్ని మౌనంగా భరించాలి. అతడి దర్మార్గాలు గుండెను పిండేస్తున్న చూస్తూ ఊరుకోవడం అంటే మనసుకు అంతకుమించిన భారం మరొకటి ఉండదు. మాట వినకుండా, చెప్పినది చేయకుండా, ఓ పద్ధతి లేని, సక్రమంగా పనిచేయలేని మంత్రి వర్గం ఆధ్వర్యంలో ఏ నిర్ణయం తీసుకోలేం. ఒకవేళ తీసుకున్నా అందులో ఎన్నో లోపాలుంటాయి. ఫలితంగా పరిపాలనే దెబ్బతింటుంది. ప్రజలను అష్టకష్టాలకు గురి చేసే అలాంటి మంత్రి మండలిని నిర్వహించడం ఏ రాజుకైనా తలకు మించిన భారమే.ఇక పేదరికం.. ఈ ప్రపంచంలో అన్నింటికంటే అత్యంత దారుణమైన బాధ పేదరికం. ఆకలి, రోగం, ఆశ.. వీటిలో ఏ ఒక్కటీ తీరక అనుక్షణం మానసిక క్షోభ అనుభవించేలా చేస్తుంది పేదరికం. అందుకే ఈ ఆరింట్లో ఏ ఒక్క పరిస్థితిని ఎదుర్కొంటున్నా.. ఆ వ్యక్తికి మించిన దురదృష్టవంతుడు మరొకరు ఉండరంటాడు చాణక్యుడు.

పూర్తి వీడియో కోసం

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!