Meeku Telusa

Ashoka Mourya | 99 మంది సోదరులను చంపితే కానీ రాజు కాలేదు

చాణక్యుడు చంద్రగుప్తుని రాజులు చేసి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించడం, రాజ్య విస్తరణ ఆ తర్వాత బిందుసారుడు హయాంలో చాణిక్యుడి పై కుట్ర మొదలైన విషయాలను తెలుసుకున్నాం. ఇక ఈరోజు బిందుసారుడు తర్వాత కాలంలో ఏం జరిగింది.. అశోక చక్రవర్తి పాలన ఎలా సాగింది అనేఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి చెప్పుకుందాం

అశోకుడు అఖండ భారత దేశాన్ని ఏలిన మౌర్య సామ్రాజ్య చక్రవర్తి. భారత ఖండం వ్యాప్తంగా బౌద్ధ స్థూపాలు స్థాపించి శాంతికి చిహ్నంగా నిలిచాడని విన్నాం. కరుణామయుడు, దయార్ద్ర హృదయుడు అయిన ఈ చక్రవర్తి రాజ్యాన్ని సుభిక్షంగా పాలించాడని చరిత్ర చెబుతోంది. కానీ మనం చెప్పుకునే శాంతి వెనక హింస ఎంత ఉందో తెలుసా…? ఎన్ని ప్రాణాలు బలి అయ్యే తెలుసా..?

బౌద్ధుల గ్రంధం మహవంశ ప్రకారం బిందుసార కి తన 16 మంది భార్యల ద్వారా 101 మంది కుమారులు కలిగారు. ఒకరి కంటే ఎక్కువ మంది వారసులు ఉండే రాజ్యాల్లో సింహాసనం కోసం అంతర్యుద్ధం ఏ స్థాయిలో జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సరిగ్గా బాహుబలి సినిమాలో జరిగినట్టే అశోకుడి విషయంలోనూ అలాగే జరిగింది.

అశోకవదన అనే గ్రంథం ప్రకారం మొరటుగా ఉండే అశోకుడు అంటే తండ్రి బిందుసారుడుకి నచ్చేది కాదు.

ఈ రోజు బిందుసార పింగళవత్సజీవ అనే సాధువు ని పిలిచి తన కుమారులలో మౌర్య రాజ్యానికి సరైన వారసుడు ఎవరో చెప్పమని కోరతాడు. ఇందుకు అంగీకరించిన పింగల ఓ మైదానంలో యువరాజులు అందరినీ ప్రవేశపెట్టాలని సూచిస్తాడు.. పింగల సూచనమేరకు యువరాజులు అందరూ మైదానం వద్ద హాజరు కావాలని బిందుసార ఆదేశిస్తాడు.

తండ్రి ఆదేశాలను పాటించడం అశోకుడికి ఇష్టం లేకపోయినా తల్లి నచ్చజెప్పడంతో మైదానంలో హాజరయ్యేందుకు సిద్ధమవుతాడు. ఇది గమనించిన రాధాగుప్త అశోకున్ని ఓ గజరాజు పైన ఎక్కించి పంపిస్తాడు. యువరాజులందరిని పరిశీలించిన పింగల అశోకుడే సరైన వాడిని నిశ్చయానికి వస్తాడు.

కానీ బిందుసార ఆగ్రహానికి గురి కావడం ఇష్టం లేక ఆ కాబోయే రాజు పేరు చెప్పడు. ఆ మేరకు హింట్ ఇస్తాడు. కాబోయే రాజు సకల విద్యా ప్రవీణుడు, మేటి వాహనంపై అధిష్టించి ఉంటాడు అంటూ పలు విధాలుగా అక్కడున్న అశోకుడి గురించి పరోక్షంగా సూచన చేస్తాడు. ఇలా పింగల చెబుతున్న ప్రతి విషయానికి తాను అర్హున్ని అంటూ అశోకుడు చెప్పసాగాడు. బిందుసారుడి ఆగ్రహానికి గురి కాకముందే పాటలీపుత్రాన్ని విడిచి వెళ్ళమని తల్లి చెప్పడంతో అశోకుడు ఉజ్జయిని వెళ్ళిపోతాడు. అలాగని అక్కడ అశోకుడు బాధ్యతారహితంగా తిరగలేదు.

ఉజ్జయిని ప్రాంతానికి మౌర్య రాజ్యం తరపున గవర్నర్ గా బాధ్యతలు నిర్వహించేవాడు. అశోకుడికి ప్రజల్లో మంచి ఆదరణ పెరిగింది. అందుకు తక్షశిల తిరుగుబాటు ఘటనే నిదర్శనం. మౌర్య సామ్రాజ్యం ఆధీనంలోని ఈ ప్రాంతంలో తిరుగుబాటు మొదలు కావడంతో బిందుసార ముందు కొందరు యువరాజులు పంపిస్తాడు. అయినా సరే పరిస్థితులు సద్దుమణగక పోవడంతో… తనకు ఇష్టం లేకపోయినా అశోకుని అక్కడ పరిస్థితులను చక్కదిద్ది రమ్మని పంపిస్తాడు. అప్పుడు అశోకుడికి వెంట తీసుకు వెళ్లేందుకు సరైన ఆయుధ సామాగ్రిని కూడా ఇవ్వడు

అయినా సరే తక్షశిల కు వెళ్లేందుకు సిద్ధపడిన అశోకుడికి… అక్కడికి వెళ్లేసరికి అనూహ్యమైన ఘనస్వాగతం లభిస్తుంది. తిరుగుబాటుదారుల అంతా అశోకుడికి జేజేలు కొట్టారు.. తమ తిరుగుబాటు బిందుసార చక్రవర్తిపై కాదని.. మంత్రుల పైనే అని అశోకుడికి స్పష్టం చేస్తారు. అలా అశోకుడు తక్షశిల దగ్గర పరిస్థితి చక్కదిద్దిన బిందుసారకు మాత్రం అశోకుడి పైన ఇంకా సదభిప్రాయం కలగదు. అందుకే బిందుసారుడు.. అశోకుని పాటలీపుత్రకి దూరంగానే ఉంచుతాడు.

ఇలా కొంత కాలం సాగిన తరువాత బిందుసార అస్వస్థతకు గురి అవుతాడు. తండ్రి మంచం పట్టాడు అని తెలిస్తే వారసుల మధ్య జరిగేది ఇంకేం ఉంటుంది అంతర్యుద్ధమే…. అశోకుడి విషయంలో అదే జరిగింది. సింహాసనం కోసం అశోకుడి అన్న విగటశోక మినహా మిగతా 99 మంది పోటీపడ్డారు. తండ్రి అనారోగ్యానికి గురయ్యాడని వార్త తెలిసిన వెంటనే అశోకుడు ఈ క్రమంలో పాటలీపుత్ర నగరాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. అడ్డు వచ్చిన 99 మంది సోదరులను హతమారుస్తాడు. అలా క్రీస్తుపూర్వం 269 వ సంవత్సరంలో మౌర్య సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుడయ్యాడు అశోకుడు.

అశోకవదన గ్రంథం ప్రకారం అశోక చక్రవర్తిని చండశోక లేదా చండశాసనుడు అని పిలిచేవారు. ఎందుకంటే అశోకుడిలో అంత క్రూరత్వం ఉండేదట.

అశోక చక్రవర్తి క్రూరత్వం ఏ స్థాయిలో ఉండేదో చెప్పేందుకు కొన్ని ఉదాహరణలు చెప్తాను వినండి. అశోకుడు మహారాజు అయ్యేందుకు కొందరు మంత్రులు సహా దాదాపు 500 మంది రాజ్య సిబ్బంది సహకరించారు. కానీ అశోకుడు సింహాసనాన్ని అధిష్టించిన అనే వారి ప్రవర్తన మారిందట. అశోకుడి ఆదేశాలను దిక్కరిస్తూ ఉండేవారట. దీంతో వారి విధేయత ను పరీక్షించేందుకు అశోకుడు వారికి ఓ పరీక్ష పెట్టాడు. పువ్వులు లేదా పండ్లతో నిండుగా ఉన్న ప్రతి చెట్టును నరకండి అని ఆదేశించాడు. ఆ పనిని వారు చేయలేకపోతారు. దీంతో అశోకుడు వారందరి తలలు నరికి చేస్తాడట

అశోకుడి క్రూరత్వానికి ప్రతీకగా నిలిచి మరో ఘటన అశోకవదన పుస్తకం వివరిస్తుంది. ఓసారి అశోకుడు తన ఉంపుడుగత్తె లతో కలిసి విహారానికి వెళతాడు. అక్కడ ఆహ్లాద వాతావరణానికి పరవశుడైన అశోకుడు పువ్వులతో నిండుగా ఉన్న అందమైన చెట్టు దగ్గర సేదతీరి అలా నిద్రలోకి జారుకుంటాడు. మరోవైపు అతని వెంట వచ్చిన ఉంపుడుగత్తెల్లో కొందరు అశోకుడు నిద్రలో ఉండగా ఆ చెట్టు పూలు కోసి, కొన్ని కొమ్మలను విరిచివేస్తారు. కాసేపటికి కళ్లు తెరిచిన అశోకుడు పువ్వులు లేక కొమ్మలతో అందవిహీనంగా చెట్టు మారడాన్ని గమనించి ఆగ్రహానికి గురి అవుతాడు. ఈ క్రమంలోనే జరిగిన విషయాన్ని తెలుసుకున్న అశోకుడు తన వెంట వచ్చిన ఉంపుడుగత్తెలు అందరినీ సజీవదహనం చేశాడట.

ఇలా అశోకుడి క్రూరత్వానికి అడ్డూ అదుపూ లేకుండా పోతుండటంతో ఆందోళన చెందిన ప్రధానమంత్రి రాధాగుప్తా భవిష్యత్తులో అశోకుడు తన చేతలతో మరణ శిక్ష విధించకుండా ఉండేందుకు గిరిక అనే తలారి ని నియమిస్తాడు. అశోకుడు స్వయంగా హతమార్చకుండా వుంటే క్రూరుడు అని అతని పై ఉన్న మచ్చ కాస్త అయిన తగ్గుతుందేమో అని రాదాగుప్త అభిప్రాయం

నియమించబడ్డ తలారి గిరిక కూడా అత్యంత క్రూరుడు అందుకే అతి తక్కువ కాలంలోనే అతనికి చండ గిరిక అనే పేరు వచ్చింది. ఇతని విజ్ఞప్తి మేరకు అశోకుడు పాటలీ పుత్ర లో ప్రత్యేక కారాగారం నిర్మించారట. దీనిని అశోకుడి నరకం అని కూడా పిలిచేవారు. బయట నుంచి చూస్తే ఈ జైలు అత్యంత ఆహ్లాదకరంగా ఉంటుంది కానీ లోపల మాత్రం నరకం కంటే దారుణంగా ఉండేదట. లోపల గిరిక ఖైదీలను చిత్రహింసలకు గురి చేసే వాడు.

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!