Meeku Telusa

ఒక ఆడది తన బాధలు నీతో చెప్పింది అంటే | Motivational Words Telugu

ఒక నిజం ఆ క్షణం మాత్రమే బాధ పెడుతుంది కానీ ఒక అబద్ధం జీవితాంతం బాధపడుతూనే ఉంటుంది

గెలుపు అనేది ఒక మార్గాన్ని మాత్రమే చూపిస్తుంది ఓటమి అనేది వెయ్యి మార్గాలను చూపిస్తుంది అందుకే నిన్నటి ఓటమిని మర్చిపోండి రేపటి గెలుపుకు ఈ రోజే బాటలు వేసుకోండి..

కఠినమైన పరిస్థితులు మనిషిని ఒంటరిని చేస్తాయి కానీ అదే కఠినమైన పరిస్థితులు మనిషిని మరింత శక్తివంతులుగా కూడా మారుస్థాయి.

చావును తప్పించలేవు జస్ట్ మనం ఈ భూమ్మీదకి ట్రావెలర్స్ గానే వచ్చాం ఎంజాయ్ చేసి తిరిగి వెళ్లిపోవడమే ఇక్కడే ఉండిపోవాలనే ఆశలు పెట్టుకుంటే చావు అంటే భయంగా బతకాలి

ప్రతి పనికిమాలిన వాళ్ళ దగ్గర మన మంచితనం నిరూపించుకోవాల్సిన అవసరం లేదు మన అంతరాత్మకు సమాధానం చెప్పుకుంటే చాలు

బాధ్యతగా ఉన్నవారికి బాధలు ఎక్కువ…. నీతిగా ఉన్నవారికి నిందలు ఎక్కువ…… నిజాయితీగా ప్రేమించిన వారికి ‘కన్నీళ్లు ‘ఎక్కువ.!!

ఆవేశంలో నువ్వు ఎవరితోనైనా గొడవ పడు… కానీ తీరిగ్గా ఆలోచించినప్పుడు నీది తప్పు అని అనిపించినప్పుడు తప్పు అనిపిస్తే మాత్రం క్షమించమని అడగడానికి సందేహపడకు.

నచ్చినప్పుడు ఒకలా… నచ్చనప్పుడు మరోలా.. ఉండేవారికి.. బంధాల అనుబంధాల విలువ తెలియదు. అలాంటి వారితో ముడిపడిన బంధం.. కన్నీళ్లను మాత్రమే కానుకగా ఇస్తుంది…!

అల వచ్చేటప్పుడు తల వంచితే ప్రాణం నిలబడుతుంది , గొడవ అయినప్పుడు ఒక్క అడుగు వెనక్కి వేస్తే బంధం నిలబడుతుంది… వెనక్కి తగ్గడం వల్ల క్షణం మాత్రమే ఓడిపోతాం కానీ.. బంధం నిలబడడం వల్ల జీవితాంతం గెలుస్తూనే ఉంటాం

ఏమి లేనప్పుడు పిలిచి పచ్చడి మెతుకులు కూడా పెట్టరు. అన్ని వచ్చాక బ్రతిమలాడి మరీ పంచభక్ష పరమాన్నాలు వడ్డిస్తారు. మనిషిని,మానవత్వాన్ని చూడరు. స్థాయిని,సంపదను చూస్తారు. ఇదే లోకం తీరు.

జీతం కోసం చేస్తున్న నచ్చని పనులు నెల తిరిగేసరికి గుర్తొచ్చే అప్పులు బాధ్యతల కోసం వదిలేసుకుంటున్న చిన్న చిన్న కోరికలు నచ్చింది తినాలన్న, కొనాలన్నా ఆలోచించేలా చేసే పరిస్థితులు..! ఇదీ సగటు మనిషి జీవితం

స్వర్గంలో అన్నీ ఉన్నాయి కానీ చావు లేదు భగవద్గీతలో అన్నీ ఉన్నాయి కానీ అబద్ధాలు లేవు ప్రపంచంలో అన్నీ ఉన్నాయి కానీ ప్రశాంతత లేదు ఈ రోజు అందరి దగ్గర అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదు

మౌనం నుంచి వచ్చిన మాటలు భయంకరంగాను చాలా గంభీరంగాను ఉంటాయి అందుకే ఎప్పుడూ కూడా మౌనాన్ని మాట్లాడించాలని చూడకు..!

అందం అనేది కళ్ళు మాత్రమే ఆకర్షిస్తుంది వ్యక్తిత్వం అనేది మనసును కూడా ఆకర్షిస్తుంది

మనది కాని పరాయి డబ్బుని మనది కాని పరాయి స్త్రీని మగాడు ఎప్పుడైతే కోరుకుంటాడో అప్పట్నుండి అతని పతనం ప్రారంభమవుతుంది

ఆడది ఏడవడం తప్పు కాదు… ఆడదాన్ని కన్నీటిని చూసి కూడా జాలి పడని మగాడి కోసం ఏడవడం తప్పు .. అది ప్రేమికుడు అయినా సరే… మొగుడు అయినాసరే..

రాసిన ప్రతి అక్షరం అద్భుతం కాకపోవచ్చు… కానీ, ప్రతి అద్భుతాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసేది అక్షరం మాత్రమే.

పగటిపూట నిద్ర వస్తుందంటే శరీరము బలహీనంగా ఉందని అర్థం..! రాత్రిపూట నిద్ర రావడంలేదంటే మనస్సు బలహీనంగా ఉందని అర్థం..!

గొర్రె కసాయి వాడిని నమ్ముతుందో లేదో తెలియదు కానీ మనిషి మాత్రం మాయమాటలు చెప్పేవాడినే నమ్ముతాడు

పిరికివాడు ఓడకముందే ఓటమి భయాన్ని నిర్మించుకుంటాడు ధైర్యవంతుడు గెలవకముందే గెలవగలనని దృఢ విశ్వాసంతో అడుగులు వేస్తాడు

ఎప్పుడైతే ఒక మనిషి నీతో మాట్లాడటం మానేస్తాడో.. అప్పట్నుంచి నీ గురించి ఇతరులతో మాట్లాడటం మొదలుపెడతాడు..!

గుర్తుంచుకో నేస్తమా..! బాధ్యతలు లేని బంధాలు నిజాయితీగా లేని ప్రేమలు యోగ్యత లేని స్నేహాలు నమ్మకం లేని జీవితాలు ఎప్పటికైనా విడిపోవచ్చు అవి ఎప్పటికీ మనకు శాశ్వతం కావు మిత్రమా..!

సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలు కన్నీళ్ళు నేర్పిస్తాయి. గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలను ఓటమి నేర్పిస్తుంది. స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలను మోసం నేర్పిస్తుంది అందుకే అంటారేమో ఏమి జరిగినా మన మంచికేనని..!

చుట్టూ ఉండే నీరు ఓడను ముంచివేయలేదు ఆ నీరు లోపలికి చేరితేనే ప్రమాదం చుట్టుముట్టే సమస్యలు మనిషిని కుంగదీయలేవు వాటిని మనసులోకి తీసుకుంటేనే ప్రమాదం

నిందిస్తున్న వారందరినీ దూరం చేసుకోకండి.. పొగుడుతున్న వారందరికీ పల్లకి మోయకండి.. కావాలనే నిందించే వారు ఉంటారు.. మీకు మంచి జరగాలనే నిందించే వారు కూడా ఉంటారు.. ప్రతి ఫలం కోసం పొగిడే వారు ఉంటారు.. ప్రతీకారం కొరకు పొగిడే వారు ఉంటారు.. ఎవరు ఏ విధంగా అనుకున్నా సరే మన లోని లోపాలను అంతర్మథనం చేసుకుని పరిశీలించుకున్న రోజు పొగడ్తలు పరిచారికలుగా, నిందలు విజయానికి నిచ్చెనలు గా అయిపోతాయి..

లైఫ్ ని ఒక చిత్తు కాగితం అనుకో… దాంట్లో నీకు నచ్చింది రాసుకో… అది ఎవ్వరికీ ఉపయోగపడనవసరం లేదు… కేవలం నీకు ఉపయోగపడితే చాలు… నీకు అర్ధం అయితే చాలు…

మన దగ్గర ఏమి లేనప్పుడు మనల్ని చేరదీసినోడే నిజమైన స్నేహితుడు అలాంటి వాళ్లని ఎప్పటికి మరువకూడదు

మనం రాసే అక్షరాలు తప్పయితే వాటిని సరిదిద్దడం సులభమే కానీ మనం నడిచే మార్గం తప్పయితే తిరిగి సరిదిద్దడం అంత సులభం కాదు

ఈ ప్రపంచంలో నటించేవాళ్ళే సంతోషంగా ఉంటారు నీతి, నిజాయితీగా మానవత్వంతో ఉండేవాళ్ళు బాధతో ఒంటరిగానే ఉంటారు

మన జీవితంలో అలోచించి కట్టవలసింది రెండు అవి ఒకటి ఇల్లు 2. తాళి … ఆలోచించకుండా కడితే : మొదటది అప్పుల పాలు చేస్తుంది. రెండవది తిప్పల పాలు చేస్తుంది ‘

ఊరి స్నేహం ఊపిరి ఉన్న వరకు ఉంటుంది.. పట్నం స్నేహం పైసలు మరియు పని ఉన్నంత వరకు ఉంటుంది.

పరమశివుడు అంతటివాడే తన భార్యకు సగ భాగం ఇచ్చాడు కృష్ణుడు అంతటివాడే తన భార్య కాళ్ళు పట్టుకున్నాడు మనం మనుషులం కనీసం భార్య కంట్లో కన్నీరు రాకుండా ప్రేమగా చూసుకోలేమా… భార్య అంటే బానిస కాదు తల్లి తరవాత తల్లి అందుకే దేవుళ్ళు సైతం తమ భార్యలకు అంతటి విలువను ఇచ్చారు…..

వెదజల్లిన అన్నీ విత్తనాలు మొక్కలు కాలేవు.. అన్నీ మొక్కలు చెట్లు కాలేవు.. అన్నీ చెట్లు పండ్లు ఇవ్వవు. అలాగే జీవితంలో కూడా అన్నీ పరిచయాలు బంధాలు కాలేవు. కొన్ని జ్ఞాపకాలు గాను, మరికొన్ని గాయాలు గాను మిగిలిపోతాయి.

వచ్చేవి పోయేవి మూడు పేదరికం, వ్యాధి, డబ్బు వచ్చినా పోనివి మూడు కీర్తి, జ్ఞానం, విద్య పోతే రానివి మూడు కాలం, యవ్వనం, పరువు వెంట వచ్చేవి మూడు పాపం, పుణ్యం, నీడ

వంద పేజీలు ఉన్న పుస్తకంలోనే తప్పులు ఉన్నప్పుడు వందేళ్ల జీవితంలో ఎన్నో ఉంటాయి సరిదిద్దుకోవాలి అలాగే సరిద్దిదుకుంటూ చదువుకోవాలి అది పుస్తకమైనా.. జీవితమైనా..

ప్రపంచంలో ఒక్క మనిషికి మాత్రమే ఉండే ప్రమాదకరమైన మానసిక రోగం ఓర్వలేనితనం తనకు లేనిది.. ఉన్నవాళ్ళను చూసి ఏడ్చేవాడికి ఎన్ని ఉన్నా వాడు నిత్య దరిద్రుడే..!!

కొంత మంది అడుగుతారు కదా..! చచ్చాక డబ్బులు తీసుకోని వెళ్తావా అని వాళ్ళందరికీ చెబుతున్నాను.. చచ్చాక శవాన్ని తీసేందుకు కూడా డబ్బులు చాలా అవసరం…

మీ గమ్యాన్ని నిర్ణయించేది మీ చేతలు తప్ప… మీ అర చేతి గీతలు కాదు…

మనసు లేని మనుషులు మన చుట్టూ ఉన్నంతవరకు మనసున్న మనుషులకు మానసిక బాధ తప్పదు.

లైఫ్ ప్రశాంతంగా ఉండాలంటే రెండే మార్గాలు ఒకటి నీ సమస్యను ఇతరులకు చెప్పకూడదు. రెండు ఇతరుల సమస్యలలో నువ్వు తలదూర్చ కూడదు.

కన్నీటి చుక్క కారిస్తే కాదు చెమట చుక్కలు చిందిస్తేనే విజయం సాధించగలరు

మూర్ఖులతో వాదన బోర్లించిన కుండపై నీళ్లు పోసినట్లు…. నీరును ఎంతపోసినా చుక్క నీళ్లు కూడా లోపలికి వెళ్లవు అలాగే మూర్ఖుడితో ఎంతసేపు వాదించినా ఫలితం శూన్యం

కోపంతో ఒక దెబ్బ కొట్టినా కొన్నాళ్ళకి మరచిపోతాం… కానీ మంచిగా నటించి… నమ్మకం మీద కొడితే దాని వల్ల బాధపడ్డ మనసు కొన్నాళ్ళకు… మనుషుల్ని నమ్మటమే మానేస్తుంది….!!

అనుమానంతో చేసే కాపురం అమాయకత్వంతో జీవించే జీవితం అయిష్టంతో భుజించే భోజనం అడుక్కొని ప్రేమించుకునే ప్రేమ ఎప్పటికైనా ప్రమాదమే..!

మన పక్కన ఉన్నవాడి కంటే పగోడు మేలు ఏమున్నా ఎదురుగా చేస్తాడు కానీ మన పక్కన ఉన్నోడు మాత్రం ఎప్పుడు వెన్నుపోటు పొడుస్తాడో తెలియదు

ప్రపంచంలో దేనినైనా కొలవడం సులభమేమో కానీ మనసులో ఉన్న బాధలను కొలవడం ఎవరికీ సాధ్యం కాదు

నువ్వు… ఎంత మంచివాడివైన కావొచ్చు, కానీ.. జనాలు వారి అవసరం మరియు మూడ్ ను బట్టి నీ క్యారెక్టర్ ను నిర్ణయిస్తారు.!! నువ్వేమి బాధపడకు, నువ్వు మాత్రం నీలా ఉండు..! వారి కోసం మారితే… నీకంటూ ఓ క్యారెక్టర్ లేకుండా పోతుంది.!! మంచో, చెడో… నీలా నువ్వు ఉండు చాలు..!!

అడగందే ఎవరికీ సలహాలు ఇవ్వకండి, వినరు విన్నట్టు నటిస్తారు . ఒకవేళ మీరు నచ్చకపోయినా మీమాటలు నచ్చకపోయినా మిమ్మల్ని దూరం పెడతారు. కాదంటే మిమ్మల్ని BLOCK చేస్తారు.

దూరంగా ఉంటే విడిపోతారు మాట్లాడకుండా ఉంటే మరిచిపోతారు అనేవి అబద్ధాలు మనసులో ఉంటే చాలు అంతకంటే దగ్గర ఇంకా ఏముంటుంది మనుషుల మధ్య దూరం కొన్నిసార్లు మనసులను దగ్గర చేస్తుంది మనుషుల మధ్య దూరం ఉంటే పర్వాలేదు కానీ మనసుల మధ్య దూరం ఉంటేనే సమస్య…

మనం మాట్లాడేది కేవలం మనకు మాటలే కావచ్చు.. కానీ వినే వాళ్ళకి అవి తూటాలు ఆ తూటా మెదడుకి తగిలితే పర్వాలేదు కొన్ని రోజుల్లో మరిచిపోతారు.. కానీ గుండెకు తగిలితే బతకలేరు మాటలు విలువైనావే కావు కత్తి కన్నా పదునైనవి కూడా..!!

ఈ జీవితంలో సంపాదించిన ధనం మరుజన్మలో పనికి రాదు, కానీ.. ఈ జన్మలో చేసుకున్న పుణ్యం జన్మ జన్మలకు పనికి వస్తుంది..!!

డబ్బుకు మనిషిని మార్చే బలం ఉంది అంటారు కానీ.. అది నిజం కాదు డబ్బుని చూస్తే మారిపోయే బలహీనత మనిషికి ఉంది..

ఆలోచించి తీసుకున్న నిర్ణయం కష్టపడి తెచ్చుకున్న అవకాశం ఓటమి తర్వాత వచ్చే అనుభవం గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం ఎప్పటికీ వృథా కావు.

ప్రపంచంలో అన్ని బంధాలు డబ్బుతోనే ముడిపడి ఉంటాయి అది అందరికి తెలిసిన నిజం కానీ ఏమీ తెలియనట్టు ప్రేమలు చూపిస్తుంటారు కొందరు

మనిషి జీవితంలో తాను బతికిన గొప్ప స్థానం తల్లి గర్భంలో ఉన్న 9నెలలు ఎందుకంటే అక్కడ ఏ మనిషీ తప్పుచేయడు ఎంత చీకటి ఉన్నా భయం వేయదు దేనిమీద ఆశ ఉండదు నాదీ అనే స్వార్థం ఉండదు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేది కూడా తల్లిగర్భంలో మాత్రమే అందుకే మనిషి చూసిన గుడి తల్లిగర్భం మనిషి చూసిన తొలి దైవం తల్లి ప్రేమ

జీవితం నిజాయితీపరుడినీ ఏడిపిస్తుంది నిందలు వేసే వారిని నవ్విస్తుంది. మాటకు కట్టుబడి ఉండే వారిని అవమానిస్తుంది.. మాటలు మార్చే వారిని గౌరవిస్తుంది..

మనల్ని భారం అనుకునే వారికి.. దూరంగా ఉండాలి..! మనల్ని బంధంగా భావించే వారికి.. దగ్గరగా ఉండాలి..! అప్పుడే మన వ్యక్తిత్వానికి విలువ ఉంటుంది..!

కంటితో చూడనివి.. చెవులతో విననివి ఎప్పుడూ నమ్మవద్దు…ఇతరులకు చెప్పవద్దు…ఎందుకంటే
కొంతమంది చెప్పేమాట వల్ల కొన్ని స్నేహాలు చెడిపోతాయి కుటుంబ బంధాలు తెగిపోతాయి

ఒకసారి నమ్మకమంటూ పోయాక ఆస్తులను అమ్మినా కూడా అభిమానాన్ని, ఆప్తులను సంపాదించుకోలేము.

పుస్తకాలు చదివితే “జ్ఞానం”… మాత్రమే వస్తుంది… మనుషులను చదివితే “లోకజ్ఞానం”… తెలుస్తుంది… ఈ రోజుల్లో…. “జ్ఞానం”లేకపోయినా బ్రతకొచ్చేమో… కానీ “లోకజ్ఞానం”తెలియకపోతే… ఈ మనుషుల మధ్య బ్రతకడం చాలా కష్టం..

అసూయతో బతికేవారికి సరైన నిద్ర ఉండదు అహంకారంతో బతికేవారికి సరైన మిత్రులు ఉండరు అనుమానంతో బతికే వారికి సరైన జీవితమే ఉండదు ఇవి మన జీవిత సత్యాలు

జీవితం అనే పొలంలో సమస్యలు అనే కలుపు మొక్కలు పెరుగుతూనే ఉంటాయి అలాగని పొలం వదిలి వెళ్ళిపో కూడదు కలుపు మొక్కలు తప్పిస్తూ జీవించాలి.

ఒక మార్గం మూసుకు పోయినప్పుడు తప్పకుండా మరోమార్గం తెరిచి ఉంటుంది దాన్ని గుర్తించటమే విజయానికి మార్గం

ఎవరినీ చులకనగా చూడకు. ఎవరికి తెలుసు ఈరోజు నువ్వు తొక్కిన రాయి కూడా రేవు శిలగా మారి గుడిలో దెవంగా మారవచ్చు. మనిషి జీవితం కూడా అంతే!

తెలిస్తే మాట్లాడు .. లేకుంటే తెలుసుకొని మాట్లాడు… అదికూడా లేకుంటే తెలిసింది మాట్లాడు
అంతేకాని. అన్ని తెలిసినట్టు మాట్లాడకు.

చిన్నప్పుడు లెక్కల బుక్కులో బోలెడు ప్రశ్నలకి సమాధానం దొరికేది చదువయ్యాక జీవితంలో వచ్చే సమస్యలకు మాత్రం సమాధానం దొరకడం లేదు ఏంటో..?

ఈ సమాజంలోని పిచ్చివాడి చేతిలో రాయి ఉన్న పర్వాలేదు కానీ అర్హత లేని వ్యక్తి చేతిలో అధికారం డబ్బు ఉంటే మాత్రం చాలా ప్రమాదకరమని గుర్తుపెట్టుకో

ఆకలి విలువ కాలే కడుపుకి కన్న తల్లికి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు

మనమెప్పుడు ఓడిపోతామో. మనమెప్పుడు పడిపోతామో అని మన శత్రువులకంటే ఎక్కువగా నా అనుకున్నవాళ్ళే ఎదురుచూస్తారు ఇది నిజం..!!

నీళ్ళ కోసం చెరువు దగ్గరకు.. పాల కోసం ఆవు దగ్గరకు వెళ్లాలి.. పాల కోసం చెరువు దగ్గరకు వెళితే ప్రయోజనం ఉండదు.. నీళ్ళ కోసం ఆవు దగ్గరకు వెళితే ప్రయోజనము ఉండదు..- అలాగే విలువ తెలియని మనుషులు దగ్గరకు విలువను ఆశించి వెళ్ళకూడదు.. ఆ విలువలు దక్కగాపోగా నిరాశ ఎదురవుతుంది.

కుక్కను తీసుకుని వాకింగ్ కి వెళ్ళటం మాని పిల్లలను తీసుకుని గుడికి వెళ్ళండి రేపటినాడు మీరు వృద్ధాశ్రమంలో చేరే పరిస్థితి రాదు

ఉన్నవాడు పోయాడని విగ్రహాలు పెట్టి, పూల దండలు వేయడం కన్నా లేనివాడు చావకూడదని ఆకువేసి అన్నం పెట్టడం మిన్న..!

నువ్వు జీవితంలో ఎన్నోసార్లు ఎంత సహాయం చేసినా సరే చివరగా నువ్వు చేయని రోజునే గుర్తుంచుకుంటారు

జీవితమంటే బడి చదువు భద్రత కలిగిన ఉద్యోగం పెళ్లి, పిల్లలు, బాధ్యతలు అని అనుకోని ముందుకు సాగిపోతే పర్వాలేదు కానీ జీవితమంటే ఇవి మాత్రమే కాదు అని అనుకుంటే మాత్రం జీవితం నీ ఊహకి కూడా అందనంతగా ఉంటుందని గుర్తుపెట్టుకో..!

మీ జీవితం అనే పుస్తకాన్ని అందరికీ విప్పి చూపించకండి ఎందుకంటే మీ భాష కొందరికి మాత్రమే అర్థమవుతుంది

బలవంతుడు కొట్టే దెబ్బ అయినా తట్టుకుని నిలబడగలమెమో కానీ నమ్మిన వాడు కొట్టే దెబ్బ తట్టుకొని నిలబడలేము…

ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకండి అది నీ మనశ్శాంతి ని దూరం చేస్తుంది ఏం జరిగినా అది దైవ నిర్ణయం అని భావించండి అది మీ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది

సమస్యలు లేకుండా విజయం సాధించినట్లయితే అది విక్టరీ కష్టాలు ఎదుర్కొని విజయం సాధించినట్లయితే అది హిస్టరీ…

స్త్రీ కి డబ్బు పిచ్చి ఉండకూడదు అలాగే పురుషుడికి ఆడదాని పిచ్చి ఉండకూడదు

ఉన్న వాడికి కష్టం వస్తే ఊరందరు చుట్టాలే కానీ లేనివాడికి కష్టం వస్తే అయినవాడు కూడా పలకరించడు

అతిగా అరవడం వలన మన మాట విలువ అనవసరంగా ఏడవడం వలన మన కన్నీటి విలువ తగ్గుతాయి

నీవు అనుకున్నది సాధించాలి ఏంటి ముందు నీ పై నీకు నమ్మకం ఉండాలి

చిన్నప్పుడు వేసే తప్పటడుగులు ముద్దొస్తాయి.. కానీ పెద్దయ్యాక వేసే తప్పటడుగులు ముప్పును తెస్తాయి.

ఒక పనులు నీవు ఉన్నత స్థానానికి చేరాలంటే ఆ పని నీకు ఇష్టమైనది అయి ఉండాలి

ఈరోజు కష్టపడితే రేపు సుఖపడొచ్చు అని చాలా మంది అంటారు కానీ ఇదే మాట చచ్చేవరకూ అనుకుంటూ పోవడమే తప్ప.. ఆ సుఖపడే రోజు మాత్రం ఎప్పటికీ రాదు..!!

ఇవాళ చూసిన మనిషి రేపు ఉండడు అయినా కూడా పక్కనోడి మీద ఏడుపులు చాడీలు, తొక్కేయడాలు నొక్కేయడాలు మాత్రం ఆపరు.

నీతో ఉన్న వారు నిన్ను ఎందుకు కలిశామా అనేలా బ్రతక కూడదు… నిన్ను విమర్శించిన వారు కూడా నిన్ను ఎందుకు వదులుకున్నామా అనేలా బ్రతకాలి

బిచ్చగాడైనా బలిసినోడైనా పోరాడేది పైసల కోసమే మరి తేడా ఎక్కడ తేడా ఎక్కడ వస్తుంది అంటే ఆ పైసలు ఒకరికి బతుకునిస్తే.. ఇంకొకరికి బలుపు నిస్తుంది.

అందమైన రూపం కొంత కాలమే ఉంటుంది కానీ అందమైన వ్యక్తిత్వం జీవితాంతం ఉంటుంది…!

కన్నీటి రుచి తెలుసా ? ఎలా ఉంటుందని అడిగితే..!! కళ్ళకు చప్పగా నాలుకకు ఉప్పగా గుండెకు బరువుగా ఎదుటివారికి లోకువగా నలుగురికి నవ్వుగా మనసుకి భారంగా ఉంటుంది..

గడిచిపోయిన కాలం గుర్తుకు రాకపోవచ్చు కానీ అన్న మాటలు మాత్రం ఖచ్చితంగా గుర్తుంటాయి

ఇప్పుడు నువ్వు నీ జీవితం గురించి బలమైన నిర్ణయం తీసుకోక పోయినట్లయితే నీ భవిష్యత్తు బలహీనపడుతుంది

మిమ్మల్ని ప్రేమించేవారి మనసుని ఎప్పుడూ గాయపర్చకండి ఎందుకంటే వారు మిమ్మల్ని ఏమీ అనలేరు మౌనంగానే మీ జీవితం నుండి వెళ్లిపోతారు

జీవితమనే పొలంలో సమస్యనే కలుపుమొక్కలు పెరుగుతూనే ఉంటాయి అలాగని పొలం వదిలి  వెళ్లి పోకూడదు

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!