Self Employment

టీ త్రాగండి కప్పు తినండి | సరికొత్త బిజినెస్ ఐడియా | Edible Tea Cups Business Ideas in Telugu

 టీ త్రాగి కప్పును తినేయవచ్చు .. అదేంటి అనుకుంటున్నారా… అవును మీరు కరెక్టుగానే విన్నారు. టీ స్టాల్ లలో డిస్పోసబుల్ కప్పులలో టీ లేదా కాఫీ త్రాగి ఆ కప్ లను పడేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మార్కెట్ లోకి కొత్తరకం కప్పులు వచ్చాయి. అవే ఎడిబుల్ టీ కప్స్, వీటిలో కాఫీ లేదా టీ త్రాగిన తరువాత ఆ కప్పులను కూడా తినేయవచ్చు. ప్రస్తుతం ఈ కప్పులకు దేశవ్యాప్తంగా విపరీతంగా డిమాండ్ ఉంది. 

ఈ రోజు ఈ బిస్కెట్ కప్పులను ఎలా తయారు చేస్తారు. ఈ వ్యాపారం మొదలు పెట్టడానికి ఎంత పెట్టుబడి కావాలి, ఈ కప్పులను ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే కనీసం మూడు నుండి నాలుగు లక్షల రూపాయల పెట్టుబడి అవసరం అవుతుంది. ఈ బిస్కెట్ కప్పుల తయారీ మిషన్ ధర రెండులక్షల రూపాయల నుండి మొదలవుతుంది. డైల సంఖ్యను బట్టి మిషన్ యొక్క రేటు కూడా పెరుతుగుతుంది.  ఈ మిషన్లు మీకు హైదరాబాద్ , బెంగుళూరు, ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో లభిస్తాయి. లేదా ఇండియా మార్ట్ వెబ్సైట్ లో కూడా ఈ మిషన్ కు సంబందించిన సప్లయర్ ల  వివరాలు ఉంటాయి అందులో నుండి మీరు ఈ మిషన్ ను కొనుగోలు చేసుకోవచ్చు.  

ఈ బిస్కెట్ కప్పులలో టీ లేదా కాఫీలాంటి వేడి పదార్థాలే కాకుండా జ్యుస్ మరియు ఐస్ లాంటి చల్లని డ్రింక్స్ కూడా త్రాగవచ్చు. ఇందులో కాఫీ లేదా టీ లాంటి వేడి పదార్థాలైతే 15 నుండి 20 నిమిషాల వరకు జ్యుస్ , ఐస్ క్రీం లాంటి చల్లని పదార్థాలు అయితే ఇంకా ఎక్కువ సేపు ఉంటాయి. అంతేకాకుండా చాకోలెట్, వెనిలా, బట్టర్ స్కాచ్, స్ట్రాబెరీ, మ్యాంగో ఫ్లేవర్  లాంటి కప్పులను తయారు చేసి కస్టమర్లను అట్రాక్ట్ చేసుకోవచ్చు.  అందుకే వీటికి ఈ మధ్య డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. 

ఈ బిస్కెట్ కప్పుల తయారీ  చూసినట్లయితే బిస్కెట్ కప్పులను సాధారణంగా రాగి, మైదా, మొక్కజొన్న పిండి, చక్కర, తేనే లను  కలిపి తయారు చేస్తారు. వీటన్నిటిని బాగా మిక్స్ చేసి మిషన్ యొక్క డై లలో వేస్తె ఆ మిషన్ యొక్క హీట్ కు కప్పులు తయారు అవుతాయి.  ఈ బిస్కెట్ కప్పులను మీరు వివిధ సైజులలో అంటే  60ml , 80ml , 100ml కొలతలతో తయారు చేసుకోవచ్చు. 

ఈ బిజినెస్ లో ఖర్చులు మరియు లాభాల వివరాలు చూసినట్లయితే ఈ మిషన్ తో మీరు రోజులో కనీసం 8 గంటల పాటు పనిచేస్తే 3000 కప్పులను తయారు చేసుకోవచ్చు. ఒక కప్పు పైన కనీసం రెండు రూపాయల లాభం పెట్టుకుని మార్కెటింగ్ చేసుకుంటే 3000 కప్పుల సేల్ పైన మీకు 6000 రూపాయల ఆదాయం వస్తుంది అంటే నెలకు 1,80,000 రూపాయలు ఇందులో మిషన్ యొక్క కరెంట్, లేబర్ ఖర్చులు, రూమ్ రెంట్, రా మెటీరియల్  మరియు ఇతర ఖర్చుల క్రింద 80,000 రూపాయలు తీసివేసిన మీరు నెలకు కనీసం ఒక లక్ష రూపాయలవరకు ఆదాయం సంపాదించుకోవచ్చు. 

ఇది కొత్తగా వచ్చిన ప్రాడక్ట్ కాబట్టి మార్కెటింగ్ చాలా ఈజీ మరియు మీ ఏరియా లొనే మార్కెటింగ్ చేసుకోవచ్చు. మీ ఏరియా లో ఉన్న టి స్టాళ్లు, కాఫి కేఫ్, హోటల్స్ ఐస్ క్రీమ్ పార్లర్లు,  మరియు కాంటీన్స్ లో వీటి వినియోగం ఎక్కువ కనుక ఆ ఏరియా లలో మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఇంకా ఇంటిలో కూడా ఉపయోగించవచ్చు.. అలాగే functions  ల లో కూడా వీటిిని ఉపయోగించవచ్చు.

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!