Self Employment

Udyogini Scheme ||వ్యాపారం చేయాలని ఉందా వడ్డీ లేకుండా మూడు లక్షలు

మహిళల అభివృద్ధి, స్వయం ఉపాధి కోసం ఎన్నో రకాల పథకాలను ప్రవేశపెడుతోన్న కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది.

మ‌హిళ‌లు పారిశ్రామిక‌వేత్త‌లుగా, వ్యాపార‌వేత్త‌లుగా ఎదిగి త‌మ‌ కాళ్ల‌పై తాము నిల‌దొక్కుకోవ‌డానికి కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్బర్ కార్యక్రమంలో భాగంగా మహిళలకు తక్కువ వడ్డీతో రుణాలు అందించడానికి ఉద్యోగిని యోజన అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద మహిళలు 3 లక్షల వరకు రుణం తీసుకొని 88 రకాల వ్యాపారాలు ప్రారంభించొచ్చు. ఈ పథకంలో భాగంగా వితంతువులు, అంగ వైకల్యం ఉన్న మహిళలకు ఎలాంటి వడ్డీ లేకుండా ఋణాన్ని ఇస్తారు. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 48 వేల మంది మహిళలు లబ్ధిపొందారు.

వీటికి రుణ పరిమితి కూడా లేదు వారు నెలకొల్పే వ్యాపారం వారి అర్హతలను బట్టి ఇంకా ఎక్కువ రుణం పొందొచ్చు. ఇక ఇతర మహిళలకు వారు లోన్ తీసుకునే బ్యాంక్ నిబంధనలను బట్టి 10 శాతం నుంచి 12 శాతం వరకూ వడ్డీ ఉంటుంది. అలాగే కుటుంబ వార్షిక ఆదాయం ఆదాయాన్ని బట్టి తీసుకున్న రుణంలో 30 శాతం వరకు సబ్సిడీ కూడా కల్పిస్తారు.

18 నుంచి 55 సంవత్సరాల మధ్య వయసుగల మహిళలు అందరూ ఈ పథకానికి అర్హులే. ఈ పథకం క్రింద దరఖాస్తు చేసుకునే మహిళలు తమ క్రెడిట్ స్కోర్, సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.. అంటే అంతకుముందు మీరు ఏదైనా ప్రభుత్వ బ్యాంక్ నుండి కానీ, ప్రైవేట్ బ్యాంక్ నుండి కానీ లేదా ఫైనాన్స్ కంపెనీల నుండి లోన్ తీసుకున సరిగ్గా తిరిగి చెల్లించకుండా ఉన్నట్లయితే ఈ పథకంలో లోన్ ఇవ్వడానికి ఆమోదించరు.

అన్ని ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకులు కొన్ని ఫైనాన్స్ కంపెనీలు లేదా ప్రైవేట్ ఆర్థిక సంస్థల్లో ఈ పథకానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ లభిస్తాయి. ఆ అప్లికేషన్ ఫామ్ లో మీ వివరాలు రాసి దాంతోపాటు ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికెట్, రేషన్ కార్డ్, ఇన్కమ్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, రెసిడెన్షియల్ సర్టిఫికెట్, బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్ కాపీలు రెండు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు సమర్పిస్తే చాలు.

దరఖాస్తు చేసుకున్న తర్వాత అధికారులు మీ వివరాలను చెక్ చేసి మీ అర్హతను బట్టి లోన్ మంజూరు చేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం. వ్యాపారం చేయాలనుకుంటున్న మహిళలకు ఇది ఒక మంచి అవకాశం. సో ఇప్పుడే అప్లై చేయండి మరిన్ని వివరాల కోసం మీ దగ్గరలో ఉండే బ్యాంక్ మేనేజర్ ని సంప్రదించండి. ఈ విలువైన సమాచారాన్ని అందరికీ షేర్ చేయండి ఇలాంటివి మరిన్ని ముఖ్యమైన సమాచారాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి.. మరో సరికొత్త బిజినెస్ ఐడియా తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు.. నమస్కారం..

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!