Self Employment

తెలుగులో ఇలాంటి బిజినెస్ ఎవరికీ తెలియదు తక్కువ పెట్టుబడితో అదిరిపోయే లాభం

పిల్లల ఈటింగ్ ప్రొడక్ట్స్ కు సంబంధించిన గుడ్ ఐటెంస్ కు మార్కెట్ లో ఎప్పుడు మంచి డిమాండ్ ఉంటూనే ఉంటుంది. చిన్న చాక్లెట్ నుండి పెద్ద పెద్ద క్యాండీల వరకు ప్రతిదీ సూపర్ ఐటెమే. కాబట్టి ఈ పిల్లల ఈటింగ్ ఐటెమ్స్ బిజినెస్ ఏదైనా ఎంతో లాభదాయకం గా ఉంటుంది. అలంటి ఒక బిజినెస్ ఐడియా నే లాలీ పాప్ మేకింగ్ బిజినెస్ . లాలీ పాప్ అనగానే పిల్లలు తినడానికి ఎంతో ఆసక్తి చూపిస్తారు. కాబట్టి నిత్యం వీటి అమ్మకం మార్కెట్ లో జోరుగా ఉంటుంది. వీటిని ఇంట్లోనే తక్కువ ఖర్చుతో తయారు చేసి మార్కెటింగ్ చేసుకోవడం ద్వారా ప్రతి నెల మంచి ఆదాయం పొందవచ్చు. 

ఈ లాలీ పాప్ తయారీకి మనకు మిషన్ కావాల్సి ఉంటుంది. దీనితో పాటు అచ్చులు, మరియు ఇంగ్రీడియంట్స్ కావాలి. 

ఇక తయారీ విధానం ఒక సారి చూసినట్లయితే 300 లాలీపాప్ ల తయారీకి ముందుగా అర లీటర్ నీటిలో మూడున్నర కేజీల చక్కర వేసి వేడి చేస్తూ కలుపుకోవాలి, చక్కర కరిగిన తరువాత ఒకటిన్నర కేజీ లిక్విడ్ గ్లూకోజ్ వేయాలి, మూడు నిమిషాల తరువాత సిట్రిక్ యాసిడ్ 20 గ్రాములు మరియు 15 గ్రాముల హైడో వేసి 300 డిగ్రీల వరకు మరిగిస్తూ కలుపుకోవాలి, 300 డిగ్రీలు వచ్చిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి తయారైన పాకం ను కిచెన్ లాబీపైన వేసుకుని చల్లారే వరకు అటు ఇటు తిప్పాలి. తరువాత దానిలో కలర్ కలిపి 3 లేదా నాలుగు లెటర్స్ కట్ చేసుకుని ప్రతి దాన్ని అటు ఇటు టిపితే మీకు ఒక వైటిష్ అవుతుంది. ఆ వైటిస్ పైన మూడు లాయర్లు అతికించిన తరువాత మనకు ఎన్ని గ్రాముల లేయర్ కావాల్సి ఉందొ ఆ సైజుకు కట్ చేసుకుని దానికి ప్లాస్టిక్ స్టిక్ ను తగిలించి మిషన్ పైన పెట్టి నొక్కితే లాలీపాప్ తయారు అవుతుంది. తరువాత దాన్ని కవర్ లో పెట్టాలి అంతే మీ ప్రాడక్ట్ మార్కెటింగ్ కోసం రెడీ అయినట్లే 

మార్కెటింగ్ విషయానికి వస్తే మీరు ఈ ప్రాడక్ట్ ను రెండు విధాలుగా మార్కెటింగ్ చేసుకోవచ్చు ఒకటి ఒక కవర్ లో 25 పీసులు లేదా ఒక ప్లాస్టిక్ డబ్బాలో 25 పీసులు చొప్పున నింపి దాని పైన మీ బ్రాండ్ స్టిక్కర్ అంటించి మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఈ లాలీపాప్ లను మన పట్టణంతో పాటు ఇతర పట్టణాల్లో ఉన్న చిల్లర దుకాణాలకు, జనరల్ స్టోర్స్ , సూపర్ మర్కెట్స్ కు సప్లై చేయాలి. ఆరంభంలో తక్కువ ధరలకే వీటిని అందించాలి. అప్పుడే మీ ప్రాడక్ట్ మార్కెట్లో బాగా సెల్ అవుతుంది. 

ఈ బిజినెస్ లో లాభాల విషయానికి వస్తే 300 లాలీపాప్ లను తయారు చేయడానికి రా మెటీరియల్, ప్యాకింగ్ కవర్స్ , స్టిక్స్ అన్ని కలిపి మీకు 300 నుండి 350 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అంటే ఒక లాలీపాప్ తయారీకి ఒక రూపాయి మాత్రమే ఖర్చు అవుతుంది. ఈ విధంగా మీరు ఒక లాలీపాప్ మీద రెండు రూపాయల లాభం వేసుకుని రోజుకు 1000 లాలీపాప్ లు అంటే కనీసం 40 ప్యాకెట్ లు అమ్ముకున్న రెండువేలు అంటే నెలకు 60000 వరకు ఆదాయం సంపాదించుకోవచ్చు. 

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!