Self Employment

బిజినెస్ తో అదిరే లాభాలు.. రూ.15 వేల పెట్టుబడితో రోజుకు రూ.4 వేల ఆదాయం

ఈ రోజుల్లో ఎంత సంపాదించినా పెద్దగా సరిపోట్లేదనే భావన చాలా మందిలో ఉంటుంది. అధిక ద్రవ్యోల్బణంతో పెరుగుతున్న ఖర్చులు దీనికి కారణం కావొచ్చు. ఇంకేదైనా కావొచ్చు. ఈ నేపథ్యంలో చాలా మంది మనసు బిజినెస్‌పై మళ్లుతోంది. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే.. పార్ట్ టైమ్ లేదా ఫుల్ టైమ్ బిజినెస్ చేయాలని ఆలోచించేవారు, కలలుగనేవారు లక్షల్లో ఉంటారు. అయితే ఏ బిజినెస్ చేయాలి? ఎందులో మంచి లాభం వస్తుంది? డిమాండ్ ఎప్పుడు వేటిపై ఉంటుంది? అనేది పెద్దగా తెలియకపోవచ్చు. దీనిపై వారికి సరైన అవగాహన ఉండకపోవచ్చు. అయితే బిజినెస్ చేయాలనీ మంచి ఆసక్తి ఉన్న వారి కోసం ఈ రోజు ఒక బిజినెస్ ఐడియా గురించి తెలుసుకుందాం. అదే బనానా పౌడర్ మేకింగ్ బిజినెస్ (Banana Powder Business). ఈ బిజినెస్ తో తక్కువ ఖర్చుతో విపరీతమైన లాభాలను ఆర్జించవచ్చు.

బనాన పౌడర్ గురించి పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ బనానా పౌడర్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుండడం వల్ల మార్కెట్లో దీనికి క్రమంగా డిమాండ్ ఏర్పడుతుంది. ఈ బనానా పౌడర్లో అధిక స్థాయిలో పోషకాలు, పిల్లల్లో రోగనిరోధక శక్తి పెంచడం వంటి లక్షణాలు కలిగి ఉంటుంది. ఇది బీపీని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది జీర్ణ శక్తిని బలోపేతం చేయడానికి కూడా ఉపయోగించబడుతుంది. అంతే కాకుండా, ఇది మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. ఈ లక్షణాల కారణంగా, అరటి పొడికి మార్కెట్‌లో డిమాండ్ ఉంది. కాబట్టి ఈ బిజినెస్ ను ప్రారంభించినట్లయితే మనం చక్కటి స్వయం ఉపాధి పొందవచ్చు.

ఇక ఈ బిజినెస్ ను ప్రారంభించడానికి మనకి హెవీ మిక్సర్ గ్రైండర్, డీహైడ్రేటర్, ప్యాక్ సీలింగ్ మిషన్ కావాల్సి ఉంటుంది. వీటిని ఆన్లైన్ లో గానీ మీ పట్టణంలో సమీపంలో ఉన్న మార్కెట్ నుండి గాని కొనుగోలు చేయవచ్చు. ఇక రా మెటీరియల్ విషయానికి వస్తే పచ్చి అరటికాయలు కావాలి. ఇవి మీ సమీపంలో అరటి పండించే రైతుల దగ్గరనుండి కొనుగోలు చేస్తే తక్కువ లభిస్తాయి. సోడియం హైపోక్లోరైట్‌ మరియు సిట్రిక్ యాసిడ్‌ లిక్విడ్స్ కావాలి. వీటితో పాటు తయారు చేసిన అరటిపొడిని ప్యాకింగ్ చేయడానికి మీ బ్రాండ్ పేరు మీద ప్రింట్ చేసిన కవర్స్ తయారు చేసుకోవాలి.

ఇక తయారీ విషయానికి వస్తే ముందుగా పచ్చి అరటిపళ్ళను సోడియం హైపోక్లోరైట్‌తో శుభ్రం చేయాలి. ఆ తరువాత వాటి తొక్కలను వలిచి సిట్రిక్ యాసిడ్ ద్రావణంలో వేసి 5 నిమిషాలు అలాగే ఉంచాల్సి ఉంటుంది. తరువాత అరటిపండ్లను ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుని వాటిని 60 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత వచ్చే డీహైడ్రేటర్ లో పెట్టి డ్రై చేయాలి. అవి డ్రై అయిన తర్వాత.. మిక్సర్‌లో వేసి పౌడర్ కింద గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడు పౌడర్ తయారవుతుంది. ఇలా తయారైన అరటి పొడిని మన బ్రాండ్ నేమ్ తో ఉన్న గాజు సీసా లేదా పౌచ్ లలో ఈ పౌడర్ ను ప్యాకింగ్ చేసుకుని సేల్ చేయడమే.

ఇక ఈ బిజినెస్ లో ఖర్చులు లాభాల వివరాలను ఒకసారి చూద్దాం. మనకి ఒక కేజీ బనాన పౌడర్ తయారీకి సుమారు 50 రూపాయల ఖర్చు అవుతుంది. ఒక కేజీ బనాన పౌడర్ ధర మార్కెట్లో 800 రూపాయల వరకు ఉంది. కాబట్టి ఒక్కో కేజీ పై 150 రూపాయల లాభాన్ని సంపాదించవచ్చు. రోజుకు 10 కేజీలు సేల్ చేసిన 1500, నెలకు 45000 రూపాయలు సంపాదించవచ్చు.

ఈ బిజినెస్ కు మార్కెటింగ్ అనేది అత్యంత కీలకం. బనానా పౌడర్ ను మార్కెటింగ్ చేయడం కోసం మనం బేకరీ దుకాణదారులకు, కిరాణా దుకాణాలు, సూపర్ మార్కెట్లకు ఇతర ఫుడ్ ఐటమ్స్ తయారీదారులకు వీటిని సేల్ చేయవచ్చు. అంతేకాకుండా మీరు ఆన్లైన్ ప్లాట్ ఫార్మ్స్ అంటే అమెజాన్, ఫ్లిప్ కార్ట్, మీషో లాంటి ఆన్లైన్ వెబ్సైటు లలో పెట్టి కూడా సెల్ చేసుకోవచ్చు.

సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ్టి బిజినెస్ ఐడియా. ఇటువంటి కొత్త వ్యాపారాలను ప్రారంభించేముందు ఆ వ్యాపారం పైన పూర్తి అవగాహన పొంది, ఈ బిజినెస్ గురించి అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకున్న తరువాత మాత్రమే ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసి ఇందులో మంచి లాభాలు సంపాదించుకోవాలని కోరుకుంటూ మరో సరికొత్త బిజినెస్ ఐడియాతో మల్లి కలుద్దాం అంతవరకూ సెలవు నమస్కరం.

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!