Self Employment

PM Vishwakarma Scheme Telugu | ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పథకం

మన దేశంలో వేగంగా పురోగమిస్తున్న సాంప్రదాయ వృత్తుల్లో విప్లవత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఆయా రంగాల్లో కొత్త విజ్ఞానం, అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానం, యాంత్రికరణ పెరుగుతుంది. చేతివృత్తుల వారికి ఆర్థిక సహాయం అందించడం సహా తక్కువ వడ్డీకే రుణాలు లభించే పీఎం విశ్వకర్మ అనే పథకాన్ని ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. 

ఈ పథకం వలన లాభాలు 

ఈ పథకం కింద మొత్తంగా 18 రకాల సంప్రదాయ చేతివృత్తిదారులకు పరికరాల కోసం రూ. 15 వేలు ఆర్థిక సాయం అందించడం సహా పనిలో నైపుణ్యం పెంచుకునేందుకు తగిన శిక్షణ ఇచ్చి రోజుకు రూ. 500 చొప్పున ఉపకార వేతనం కూడా ఇవ్వనుంది కేంద్రం. శిక్షణ తర్వాత వడ్డీల్లో రాయితీ  బ్యాంక్ లోన్ కూడా వస్తుంది.

ఎవరు అర్హులు?

‘విశ్వకర్మ కౌసల్య యోజన’ పథకం లబ్ధి పొందాలంటే  1) వడ్రంగులు , 2) పడవలు తయారు చేసేవాళ్ళు , 3) ఆయుధాలు లేదా కవచ తయారీ దారులు , 4) కుమ్మరులు , 5) సుత్తి / మరేదైనా పరికరాల తయారీ , 6) తాళాలు తాయారు చేసేవాళ్ళు , 7) కమ్మరులు  (eg: కుండలు తయారు చేసేవాళ్ళు ) 8) శిల్పులు ( ప్రతిమలు,రాళ్ళపై శిల్పాలు చెక్కేవాళ్ళు లేదా రాళ్లను పడగల గొట్టే వృత్తిలో వున్ననూ) 9) బంగారం పని చేసే వాళ్ళు, 10) చెప్పులు తయారీ దారులు మరియు చర్మకారులు, 11) తాపీ పని చేసేవాళ్లు, 12) గంపలు/చాపలు/చీపురులు తయారు చేసే వాళ్ళు, 13) కొబ్బరి నారతో తయారు చేసే వస్తువులు లేదా సంప్రదాయ ఆట బొమ్మలు తయారు చేసేవాళ్ళు    14) క్షురకులు (నాయి బ్రాహ్మణులు )  15) పూల మాలలు తయారీదారులు, 16) రజకులు 17) టైలర్లు 18) చేపలు పట్టె వలలను తయారు చేసే వాళ్ళు  ఈ పథకం కింద రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

PM విశ్వ కర్మ పథకం యొక్క అర్హతలు ఏమిటి ?

కనీస వయస్సు రిజిస్ట్రేషన్ చేయు సమయానికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. పైన తెలిపిన 18 రకాల వృత్తులలో ఏదైనా ఒక వృత్తి అయినననూ ఖచ్చితంగా చేస్తూ ఉండాలి.  గత 5 సంవత్సరాలలో PMEGP, PM SVANIDHI, MUDRA వంటి లోన్ లు పొంది ఉండకూడదు.ఒకవేళ గతంలో ఋణము పొంది తరువాత పూర్తిగా చెల్లించి ఉన్నట్లయితే ఈ పథకానికి అర్హులు. కుటుంభంలో ఒకరు మాత్రమే అర్హులు

ప్రధాన మంత్రి విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ యోజన కోసం అవసరమైన పత్రాలు

ఆధార్ కార్డ్ ఫోటో కాపీ, పాన్ కార్డ్ ఫోటో కాపీ, పాస్‌పోర్ట్ సైజు కలర్ ఫోటో, ఇమెయిల్ ఐడి, ఫోను నంబరు, కుల ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ పత్రం

ఎలా దరఖాస్తు చేసుకోవాలి. 

ఈ పథకం కింద మొదటి విడతగా 18 రకాల చేతి వృత్తుల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. భవిష్యత్ లో మరిన్న చేతి వృత్తులను చేరుస్తారు. ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలంటే https://pmvishwakarma.gov.in/ అనే వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి. అయితే ప్రస్తుతం మీ సేవా ద్వారా మాత్రమే అందుబాటులో ఉంది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి Sep -17వ తేదీ నుండి Online లో అవకాశం ఇచ్చారు.

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!