Self Employment

మహిళా ఈ హాత్ | What is the aim of Mahila e Haat scheme?

 మహిళల అభివృద్ధి  కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుంది. కొత్త కొత్త పథకాలతో, ప్రోగ్రాములతో మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు దోహదపడుతుంది. ఉద్యోగాల్లోనే కాకుండా మంచి పారిశ్రామికవేత్తలుగా మారేందుకు చేయూతనందిస్తోంది. వివిధ బ్యాంకుల ద్వారా లక్షల్లో రుణాలు అందించడమే కాదు వాటిని మార్కెట్ చేసుకునేందుకు అవకాశాలను కల్పిస్తోంది. 

మహిళలు పారిశ్రామికవేత్తలుగా రాణించేందుకు పెట్టుబడి ఉంటే సరిపోదు. మార్కెటింగ్ చేసుకునేందుకు మంచి ఫ్లాట్ ఫామ్ కూడా ఉండాలి. ఆ వేదికే మహిళా ఈ హాత్. ఇది ఆన్ లైన్ మార్కెటింగ్ పోర్టల్. మహిళలు తమ వ్యాపారానికి సంబంధించిన ప్రొడక్టులను ఈ పోర్టల్లో సేల్‌కు పెట్టుకోవచ్చు. నచ్చినవాళ్లు ఆ ప్రొడక్ట్‌ను కొనుగోలు చేస్తారు. 

ఈ మహిళా ఈ హాత్ ఆన్ లైన్ పోర్టల్‌ను రాష్ట్రియ మహిళా కోష్ ఆధ్వర్యంలో మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ స్థాపించింది. మహిళలు తయారు చేసిన.. లేక రూపొందించిన ఉత్పత్తులను ఈ వెబ్‌సైట్‌లో పెట్టి విక్రయించుకునే అవకాశం ఉంది. ఉత్పత్తికి సంబంధించిన వివరాలతో పాటు, ఫొటోగ్రాఫ్స్, పొడక్ట్ ధర, అడ్రస్, మొబైల్ నెంబర్‌ కూడా ఈ వెబ్‌సైట్‌లో ప్రదర్శిస్తారు. దీంతో ఆ ఉత్పత్తి కావాల్సిన వాళ్లు డైరక్ట్‌గా సంబంధిత వ్యక్తులకు ఫోన్‌ చేసి కొనుగోలు చేస్తారు. అంటే కొనుగోలుదారులకు, ఉత్పత్తిదారులకు మధ్య దళారులు ఉండరు. అమ్మేవాళ్లకు, కస్టమర్లకు మహిళా ఈ హాత్ అనుసంధానంగా పనిచేస్తోంది. 

అయితే ఈ ఆన్‌లైన్‌ పోర్టల్లో ఉత్పత్తులను పెట్టడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి.  వాటిని కచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. రూల్స్ అతిక్రమిస్తే ఉత్పత్తిని అమ్మకానికి పెట్టేవాళ్లు, కొనుగోలుదారులు ఇద్దరూ రాష్ట్రియ మహిళా కోష్‌కి నష్టపరిహారం చెల్లించాలి. వెబ్‌సైట్‌లో ప్రొడక్ట్స్‌ను పెట్టి విక్రయించదలుచుకున్న మహిళలు భారతీయురాలై ఉండాలి. 18 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారై ఉండాలి. ఈ పోర్టల్‌ ద్వారా అమ్మే ప్రొడక్ట్లులకు సంబంధించి ఎటువంటి లీగల్ సమస్యలు ఉండకూడదు. ప్రొడక్ట్ నాణ్యతతై ఉండాలి. ఉత్పత్తిదారులే ప్రొడక్ట్‌కు సంబంధించిన పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. వస్తువు తీసుకునేవాళ్లకు టైమ్‌కి పొడ్రక్ట్ అందించాలి. ఏ ఉత్పత్తి అయిన 30 రోజులు పాటు ప్రదర్శించడం జరుగుతుంది. ఆ రోజుల్లో సేల్ కాకపోతే 30 రోజుల తర్వాత మళ్లీ వెబ్‌సైట్‌లో పెట్టడం జరుగుతుంది.  

వెబ్‌సైట్‌లో పెట్టే ప్రొడక్ట్‌ల ఎంపికకు సంబంధించిన అన్ని హక్కులు రాష్ట్రీయ మహిళా కోష్‌కి హక్కు ఉంటుంది. రాష్ట్రీయ మహిళా కోష్‌ సెలక్ట్ చేసిన తర్వాత పారిశ్రామికవేత్తలకు ఆ విషయం తెలియజేస్తుంది. ఆ ప్రొడక్ట్‌కు సేల్ పెట్టేందుకు అంగీకరిస్తూ ఒక లెటర్‌ను పంపిస్తుంది. చట్టవిరుద్ధమైన, అక్రమ రవాణా వస్తువులను ఈ పోర్టల్లో ప్రదర్శించదు. పారిశ్రామికవేత్తలు డైరక్ట్‌గా కస్టమర్ల దగ్గర నుంచి పేమెంట్‌ను తీసుకుంటారు. 

ఇలాంటి పోర్టల్స్ వల్ల బిజినెస్‌లో రాణించాలనుకుంటున్న మహిళలకు ఎంతో ఉపయోగపడతాయి. వారి వారి ప్రొడక్టులను ఆన్‌లైన్‌లో డైరక్ట్‌గా విక్రయించుకునే మంచి వేదికగా దీనిని చెప్పుకోవచ్చు. అయితే చాలామందికి దీని గురించి. అలాంటి వారికి తెలిసేలా ఈ సమాచారాన్ని షేర్ చేయండి.

MAHILA E HAAT PORTAL

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!