Chanakya Niti Fashion Lifestyle Meeku Telusa

Million Dollar Words in Telugu | ఆడది అందంగా ఉన్నప్పుడు, మగవాడు పదవిలో ఉన్నప్పుడు

అమ్మో పక్కింటి వాడు కారు కొన్నాడు నా బతుక్కి ఇంకా ఈ డొక్కు బైకే …తూ నా బతుకు వాడు రోజు రెస్టారెంట్లలో ఇష్టం వచ్చినవన్నీ తింటూ ఉంటాడు నా బతుక్కి రోజు ఈ లంచ్ బాక్స్ భోజనమే…. నాతో పాటు చదువుకున్న వాడు ఇప్పుడు లక్షలు సంపాదిస్తున్నాడు నేను ఇంకా ఈ పది వేల రూపాయల జీతంతో నెట్టుకు రావాల్సి వస్తోంది ఇలాంటి బతుకు ఎందుకు ఇచ్చావు దేవుడా అంటూ గుర్తుకువచ్చినప్పుడల్లా ఆ దేవుడిని కూడా తిట్టుకుంటూ బాధపడుతున్నవా మిత్రమా ఒక్కటి చెబుతాను విను…. కాళ్లు లేని వాడు నడిస్తే బాగుండు అనుకుంటాడు కళ్ళు లేని వాడు చూడ గలిగితే చాలు అనుకుంటాడు చెవులు లేని వాడు వినాలని ఆశపడతాడు ఎందుకంటే వాళ్ళకీ వాటి విలువ ఏంటో తెలుసు కాబట్టి.  కాళ్లతో నడుస్తున్న ప్రతిసారీ పల్లకిలో వెళ్లే వాడిని చూసి ఎందుకు బాధ పడతావు.  కాళ్లు లేక కర్ర సహాయంతో నడిచే వాడి ధైర్యం కూడా నువ్వు గమనించు. నీ ఎదురుగా ఎవరైనా అందమైన స్వరంతో పాడుతూ ఉంటే నువ్వు అలా పాడలేక పోతున్నందుకు అసహ్యించుకుంటావు ఎందుకు మాటలు రాణి మూగవాడి వేదన గురించి ఒక సారి ఆలోచించు మహారాజుల ప్రతిరోజు పంచభక్ష పరమాన్నాలు తినలేక పోతున్నాను అని కన్నీరు పెట్టుకుంటారు ఎందుకు కటిక దరిద్రం తో బాధపడుతూ ఒక్క పూట భోజనం కోసం బిక్షం ఎత్తుకునే వాడి దీనావస్థను ఒక్కసారి ఊహించుకో… నీకు దేవుడు అన్నీ సక్రమంగా ఇచ్చాడు అందుకు ఆ పరమాత్ముడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పి అడుగు ముందుకు వెయ్యి అప్పుడు నీలో నువ్వు లోపాలుగా భావిస్తున్నా వాటన్నిటినీ అధిగమించి సామర్థ్యాన్ని సాధించగలవు అర్థమైందా 

🔥 ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

కష్టపడి బ్రతికే వాళ్లకి ఒకరి సొమ్ము తినాలని ఎప్పుడు అనిపించదు ఎందుకంటే ఎదుటి వారి కష్టం తినకూడదని సంస్కారం వాడి పడిన కష్టం వాడికి నేర్పించింది నేను ఎదుటి వారి సొమ్ము తినాలి అనుకున్న వాడికి కూడా ఊరికే ఏం రాదు కదా వాడు కష్టపడితేనే వచ్చేది వాడు తినాల్సిన సొమ్ముని నేను తింటే నేను పడిన కష్టానికి అర్థం లేదు కదా అని అర్థం చేసుకుని ఒకరి సొమ్ము తినకూడదని ఆలోచనతో బ్రతుకుతాడు..!!

సుగ్రీవుడికి,, సొంత అన్ననే శత్రువు పాండవులకు, పెద్దనాన్న కొడుకులే శత్రువులు శ్రీరాముడికి,, పిన్న తల్లే శత్రువు మన,, రామాయణ,, మహాభారత,, చరిత్ర చెబుతుంది మన సొంత వారే మనకు శత్రువులు అని అందుకే మన అనుకున్న వారితోనే జాగ్రత్తగా ఉండాలి అని చెప్పకనే చెప్పారు…

గొప్ప దాంపత్యం అంటే…? తన వద్ద ఏమీ లేనప్పుడు నీతో నేనున్నానని భరోసా ఇచ్చే భార్య. వృద్ధాప్యంలో నీకు నేనున్నాను అని అండగా నిలిచే భర్త ఉండడమే.భార్యాభర్తల బంధం అనేది రెండు హృదయాలకు సంబంధించింది. ఎట్టి పరిస్థితులలోనూ మూడో వ్యక్తి జోక్యానికి తావు ఇవ్వకూడదు. భరించలేని బంధం కాదు భార్యాభర్తల బంధం..! కట్టే కాలేదాకా.. ఒకటిగా.. ఒకరి కోసం ఒకరు కలిసి బ్రతికే.. బంధమే భార్యాభర్తల బంధం..

ఇల్లు కట్టేటప్పుడు దేవుడు కోసం ఒక గదినే కేటాయిస్తున్నాం ఒక ఇళ్లు అద్దెకు తీసుకునే తప్పుడు  దేవుడు కోసం ఒక గది కాకపోయినా ఒక చిన్న సెల్ఫ్ అయినా ఉండాలని వెతుక్కుంటాం, కనిపించని ఆ దేవుడి కోసం ఇంతగా ఆరాటపడే మనం మరి దేవుడు కంటే ఎక్కువ అయిన నీ తల్లిదండ్రుల కోసం ఎందుకు ఒక చోటునీ కూడ కేటాయించకుండా వృద్ధాశ్రమంలోకి తరిమేస్తున్నాం…? తల్లి తండ్రులు అందరికంటే ముందు అందుకే మొదట తల్లి రెండు తండ్రి మూడు గురువు చివరగా దైవం అని చివరగా దేవుడికి స్థానం ఇచ్చారు పెద్దలు.  జీవితంలో నువ్వు ఏమి సాధించావు అని అడిగితే కోటి రూపాయలు సంపాదించాను అనే వాడికన్నా తల్లిదండ్రులను కన్నీరు కార్చకుండా చూసుకున్నాను అనేవాడు ధనవంతుడు

📌 తెలంగాణ లో ఉద్యోగాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

గెలుపంటే..ఆస్తులు, అంతస్తులు కూడబెట్టడం కాదు మనుషుల మనసులను గెలుచుకోవడం..బంధమంటే..అన్నీ బాగున్నప్పుడు కలిసి ఉండటం కాదు ఏమీ లేనప్పుడు కూడా తోడుగా నిలవడం..స్నేహమంటే..ఆనందాలప్పుడు చేతులు కలపడం కాదు.. కష్టాలప్పుడు నేనున్నానంటూ చేయూతనివ్వడం..గౌరవమంటే..అధికారాన్ని చూసి లేచి నిలబడటం కాదు.. వ్యక్తిత్వాన్ని చూసి చేతులెత్తి మ్రొక్కడం….విలువలంటే..జనాల కోసం మాటలుచెప్పి తప్పించుకోవడం కాదు.. జన్మంతా విలువల కోసం కట్టుబడటం..

స్వయంగా పైస్థాయికి రావాలని ప్రయత్నం చేసేవారికి ప్రోత్సహం ఇవ్వకపోయినా పరవాలేదు, నువ్వు ఎంత ప్రయత్నం చేసిన పైకి రాలేవనీ చెప్పే వాళ్ళు పక్కన ఉంటే, అంతవరకూ ఎంతో నమ్మకంగా ఉన్నవారి మనసులో నీ వల్ల కాదు అనే సందేహం మొలకత్తేటట్లు చెసి సంతోషపడతారు, ఎప్పుడు అలాంటి వారి మాటలు పట్టించుకోకుండా మనం చేసే ప్రయత్నం చేస్తూనే ఉండాలి అప్పుడే మనం అనుకున్నది చెసి చూపించగలం, ఒకవేళ చిన్న ఆటంకం వచ్చిన దానిని సరిచేసుకుని మన స్థాయిని పెంచుకోగలం, ఎవరు ఏమి అన్న మన లక్ష సాధనలో విజయం సాధించగలం, చేరాలని అనుకున్న స్థాయికి చెరగలం అన్నది మర్చిపోకూడదు.

నలుగురు ఏమనుకుంటున్నారో నీకనవసరం ఎదుటివాడి మాటలు పట్టించుకుని బాధపడుతూ సమయం వృధా చేసుకోకు నీకు తోచిన మంచేదో చేసుకుంటు వెల్లు . నువ్వెంటో నీకు తెలుసు ప్రతీది ఒకరి దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. చెప్పేటోడు చేరదిస్తాడా…? అనేటోడు ఆదుకుంటాడా…?వినేటోడు విలువ ఇస్తాడా…?ఎవడూ ఎవడికి … ఏం చేయడు చేసినట్లు … నటిస్తారంతే!!

అబద్దాలు చెప్పేవాడు లక్ష చెబుతాడు ఎందుకంటే వాడి దగ్గర లక్ష కథలు సిద్దంగా ఉంటాయి నిజం చెప్పేవాడు ఒకే విషయాన్ని పదేపదే చెబుతాడు ఎందుకంటే నిజమనేది ఒక్కటి మాత్రమే ఉంటుంది కాబట్టి కొన్ని అలవాట్లకు దూరంగా ఉంటే మన ఆరోగ్యానికి మంచిది.. కొంతమంది మనుషులకు దూరంగా ఉంటే మన జీవితానికే మంచిది..

 ఆడది అందంగా ఉన్నప్పుడు, మగవాడు పదవిలో ఉన్నప్పుడు వచ్చే ప్రశంసలు అన్ని సుద్ద అబద్దాలే.. అవే నిజమని నమ్మి అసలు మోసపోకండి. 

నీ చుట్టూ జనాలు ఉన్నారు అంటే.. నువ్వేదో చేస్తున్నావ్ అని అర్థం.. నువ్వేదో సాధిస్తున్నావ్ అని అర్థం.. నీ దగ్గర ఏదో ఉందని అనిపించినంత వరకు.. నీ చుట్టూ చాలా మందే ఉంటారు.. డబ్బు అయినా..పేరు అయినా..హోదా అయినా.. వీటిలో ఏది ఉన్నా..నీ లెవెల్ వేరేలా ఉంటుంది.. ఇది ఒక వైపు అయితే.. నీ చుట్టూ ఎవరు లేరు అంటే.. నువ్వు ఏదో సరిగ్గా చేయట్లేదని అర్థం.. తప్పు చేస్తున్నావ్ అని అర్థం.. నీ చుట్టూ ఎవరు లేరు అంటే.. నీ దగ్గర ఏమి లేదని అర్థం.. ఎందుకంటే మనిషి చుట్టూ అవసరాలు.. అవసరాల చుట్టూ మనుషులు.. వేషాలు మారుస్తారు..మోసాలు చేస్తారు.. వాడుకుంటారు.. వదిలేస్తారు..!!

మనకున్న బాధ ఎదుటివారితో చెబితే ‘లోకువ అవుతాం మన బలహీనత ఎదుటివారితో చెబితే ఇంకా బలహీనులవుతాం మన సంతోషాన్ని ఎదుటివారికి చెబితే మంచి స్నేహితులవుతాం మన బాధలు బలహీనతలు, కష్టాలు ఈ సమాజానికి అవసరం లేదు కాబట్టి మన బాధలు బలహీనతలు మనలోనే దాచుకొని సంతోషాన్ని మాత్రం వ్యక్తం చేసి మనము సంతోషముగా ఉందాం అందరిని సంతోషపెడదాం ఇదే జీవితం…  

తాళంతో పాటే తాళం చెవి కూడా తయారవుతుంది అలాగే సమస్యతో పాటు పరిష్కారమూ కచ్చితంగా ఉంటుంది దానిని మనం కనుక్కోవడమే ఆలస్యం గెలవక పోవడం ఓటమి కాదు మళ్లీ ప్రయత్నించక పోవడమే అసలైన ఓటమి. విజయం మనకు ఓకే దారిని సూచిస్తుంది. కానీ అపజయం వంద పరిష్కారాలను అందిస్తుంది!!!అందుకే పరిష్కారం లేని సమస్య గురించి చింతించకు… పరిష్కారం ఉన్న సమస్యను వదలకు!!

శత్రువుకి కూడా ఒక అవకాశం ఇవ్వాలి. స్నేహితునికి రెండు అవకాశాలు ఇవ్వాలి. కానీ నమ్మక ద్రోహం చేసిన వాడికి ఒక్క ఒవకాశం కూడా ఇవ్వకూడదు. కాదని ఇచ్చినట్లయితే మీ వినాశనానికి మీరే కారణం అవుతారు. మిమ్మల్ని ఒక్కసారి వద్దనుకొని వదిలేసిన వారుమరలా పిలిచారని పరిగెత్తకు..!!వెళ్లే ముందు ఈ సారి చేసే అవమానం ఇంకెంత ఘోరంగా ఉంటుందో.. అనుభవించాల్సిన భాద ఇంకెంత కష్టంగా ఉంటుందో అని… ఒక్కసారి ఉహించుకో!!

కొన్నింటి విలువ కోల్పోయినప్పుడు తెలుస్తుంది. కొన్నింటి విలువ దొరకనప్పుడు తెలుస్తుంది. మరీకొన్నింటి విలువ కాలం గడిచే కొద్ది తెలుస్తుంది. వాళ్లకు నీ విలువ కూడా అంతే కాలం గడిచే కొద్దీ తెలుస్తుంది. నిన్ను దూరం చేసుకున్నందుకు వాళ్ళలో వాళ్ళే కుమిలి పోయే రోజు వస్తుంది. వాళ్ళు నిన్ను వదిలి వెళ్లినందుకు వాళ్ల మీద వాళ్లకే అసహ్యం వేస్తుంది. ఆనందాన్ని కోరుకుంటూ ఆనందాన్ని కోల్పోయామని వాళ్ళు ఏడ్చే రోజు కచ్చితంగా వస్తుంది.

⭐  వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండి ⭐  టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవండి
👉 వాట్సాప్ గ్రూప్ 👉 టెలిగ్రామ్ గ్రూప్

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!