GK Telugu

Amma Vodi Application Form Download | అమ్మఒడి అప్లికేషన్ ఫారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 26 జనవరి 2020 నుండి అమలు చేయబోయే అమ్మఒడి పథకం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు వర్తిస్తుంది అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి 24 జూన్ 2019 న అమరావతి లోని ప్రజావేదిక లో జరిగిన కలెక్టర్ల సమావేశంలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. 

ఈ పథకం క్రింద తమ పిల్లలను పాఠశాలకు పంపే ప్రతి తల్లికి సంవత్సరానికి 15,000 రూపాయలు సాయం అందిస్తామని ప్రకటించారు. 


గతంలో జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు అమ్మఒడి పథకం క్రింద తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి, ప్రభుత్వ , ప్రైవేట్ పాఠశాలలో తమ పిల్లలలను చదివించే ప్రతి తల్లికి 2020 రిపబ్లిక్ దినోత్సవం రోజున 15,000 రూపాయలు సాయం అందించనున్నారు.  అయితే ఈ పథకం అంగన్వాడీ బడికి వెళ్లే చిన్నపిల్లలకు , అలాగే నర్సరీ, ఎల్.కె.జి. లేదా యు.కె.జి. చదివే పిల్లలకు కూడా వర్తిస్తుందా లేదా అనే విషయం పైన ఇంకా క్లారిటీ రావలసి ఉంది. 

ఈ మేరకు ఈ పథకానికి సంబంధించి అప్లికేషన్ ఫారం కూడా విడుదల అయింది. ఇందులో తల్లిపేరు, తండ్రిపేరు, కుంటుంబ  ఆదాయం,బడికి వెళ్లే పిల్లల  సంఖ్య, ఒకవేళ ఇద్దరు, లేదా అంతకన్నా ఎక్కువమంది ఉంటె మొదటి విద్యార్థి వయసు,  చదువుతున్న తరగతి, పాఠశాల  పేరు,రెండవ విద్యార్థి వయసు, చదువుతున్న తరగతి, పాఠశాల పేరు, కులం, గ్రామం,  మండలం,జిల్లా వివరాలు నమోదు  చేయాలి, ఈ అప్లికేషన్ తో పాటు తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు, అలాగే పిల్లల స్టడీ సర్టిఫికెట్ తదితరాలు జతచేయవలసి ఉంటుంది. 

ఈ అప్లికేషన్ ఫారాలను త్వరలో నియమించబోయే గ్రామ వాలంటీర్ లేదా వార్డు వాలంటీర్ ల వద్ద కూడా లభిస్తాయి. లేదా మీకు దగ్గరలోని పంచాయతీ లేదా కార్పొరేషన్ ఆఫీస్ లలో కూడా లభిస్తాయి. ఇలా పూర్తి చేసిన అప్లికేషన్ మీద గ్రామ పంచాయతీ కార్యదర్శి మరియు మండల పరిషద్ అభివృద్ధి అధికారి ఇద్దరు ద్రువీకరిస్తేనే మీరు అమ్మ ఒడి పథకానికి అర్హులు అవుతారు, 

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!