టీ వల్ల మనకు కలిగే 5 చెడు ప్రభావాలు

నేటి కంప్యూటర్ యుగంలో టీ కి బానిసైన వారు చాలా మందే ఉన్నారు. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకూ పిల్లల నుంచి పెద్దల వరకూ టీ అలవాటు చేసుకుని ఉంటారు. అయితే టీ తాగడం వల్ల 5 చెడు ప్రభావాలు కలుగుతాయని మీకు తెలుసా?.. అయితే అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

1. డీహైడ్రేషన్ ( Dehydration )

మనం తాగే టీలో ఎక్కువగా కెఫిన్ ఉంటుంది. ఈ కెఫిన్ ని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల ఆందోళన ( anxiety ), ఒత్తిడి (stress ), నిద్రలేమి ( insomnia), చిరాకు ( irritability ), అజీర్ణము (Upset stomach) వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. రెండు కంటే మూడు టీలను మీరు రోజూ తాగుతున్నట్లయితే మీ శరీరంలో నీటిశాతం తగ్గి డీహైడ్రేషన్ వచ్చే అవకాశం కూడా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.  

2.పోషకాల లోపం ( May Cause Vital Nutrient Deficiencies (iron)

పట్టణ ప్రాంతాలలో చాలా మంది ఐరన్, బీ12 విటమిన్‌ లోపం ఉన్న ఆహారాలు ఎక్కువ తింటున్నారు. ఆకుకూరలు వాడకం తగ్గించి, పాలు కాకుండా టీ, కాఫీలు ఎక్కువ తాగడం వల్ల వారికి రక్తహీనత లోపం ఏర్పడుతుంది. టీ తాగేవారిలో ఎక్కువగా పౌష్టికాహారలోపం, ఐరన్ లోపం ఏర్పడి ఎనిమియా వచ్చేందుకు ప్రభావం చూపుతోంది.

3.కడుపు ఉబ్బరం (Bloating)

కడుపులో ఉబ్బరంగా ఉన్నట్లు అనిపిస్తోందా? పరిష్కారమేంటో తెలియక ఏమీ తోచడం లేదా? అయితే మీరు అధికంగా టీ తాగుతున్నారని అర్థం చేసుకోండి. టీ, పాలల్లో ఉండే లాక్టోజ్‌ జీర్ణం అయ్యే శక్తిని తక్కువగా చేస్తుంది. దీనివల్ల గ్యాస్, ఉబ్బరం, తిమ్మిర్లకు దారితీస్తుంది. 

4.ఆందోళన, చికాకు ( Anxiety and Restlessness)

టీలు ఎక్కువగా తాగడం వల్ల మనిషిలో ఆకలి చచ్చిపోతుంది. ఆకలి లేకపోతే ఆహారం తినకపోవచ్చు. టీలు ఎక్కువగా తాగడం వల్ల ఆక్సిడెంట్లు పెరుగుతాయి. ఈ ఆక్సిడెంట్లు ఎక్కువైతే క్యాన్సర్‌, ఊబకాయం లాంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. టీ ఎక్కువగా తాగడం వల్ల నిద్ర పట్టదు. నిద్ర సరిగా పట్టకపోవడం వల్ల ఆందోళన, చికాకు వంటివి కలుగుతాయి.

5.వ్యసనానికి బానిసయ్యే ప్రమాదం ( Can Get You Addicted)

టీని పరగడుపున తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, గ్యాస్ సమస్యలు ఎదురవుతాయి. ఈ వ్యసనం టీకి బానిసగా మార్చడమే కాదు.. అలసటను చికాకును తెచ్చిపెడుతుంది. టీ తాగడం వల్ల పిత్తాశయంపై ప్రభావం పడుతుంది. దీని వల్ల పైత్య రసం పెరుగుతుంది. శరీరంలో పైత్య రసం పెరగడం వల్ల.. తల నొప్పి రావడంతో పాటు గుండెల్లో మంటగా కూడా అనిపిస్తుంటుంది. అధిక టీ తాగుతుండటం వల్ల కెఫిన్ కి అలవాటు పడిపోతారు. ఒకానొక సమయంలో టీ లేకపోతే తలనొప్పిని భరించలేకపోతారు.