బ‌రిఫీ (Chikki) త‌యారీ బిజినెస్‌తో భారీ ఆదాయం..

మనలో చాలామందికి అది ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ, సమయం ఏదైనా సరే చిరుతిళ్లు తినే అలవాటు ఉంటుంది. ఇలా ఏదో ఒకటి తినడం పరిపాటిగా అలవాటు. కానీ ప్రస్తుతం  అందరూ ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. కాబట్టి మంచి పోషక విలువలు కలిగిన ఆహారం పై దృష్టి సారిస్తున్నాయి. ఇలా ప్రస్తుతం పోషకాహారం కలిగిన వాటిలో బ‌రిఫీ ప్రసిద్ధి చెందింది. దీనినే చిక్కి అని కూడా అంటారు  ఇది తక్కువ ఖర్చుతో అధిక పోషక విలువ మనకు అందజేస్తుంది.
అందువలన ఇప్పుడు బ‌రిఫీ తయారీ వ్యాపారం లాభదాయకంగా మారింది. వీటిని పట్టణాలలో ఎనర్జీ బార్స్, న్యూట్రీషియన్ బార్స్, హెల్త్ బార్స్ అని పిలుస్తున్నారు. ఇంకా ఉదయం టిఫిన్‌తో పాటు, జిమ్‌కి వెళ్లి వచ్చిన తర్వాత, ఏదైనా ఆటలు ఆడే ముందు వీటిని తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారు.