పదవతరగతి, ఇంటర్ తో ప్రభుత్వ ఉద్యోగాలు ఇండియన్ కోస్ట్ గార్డ్ లో జాబ్స్

తక్కువ విద్యార్హతతో ప్రభుత్వ ఉద్యోగం సొంతం చేసుకోవాలి అనుకునే వారికీ శుభవార్త , ఇండియన్ కోస్ట్ గార్డ్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇండియన్ కోస్ట్ గార్డ్ లో జనరల్ డ్యూటీ మరియు డొమెస్టిక్ బ్రాంచి లలో నావిక్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 11 ఫిబ్రవరి 2025 నుండి 25 ఫిబ్రవరి 2025 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

సంస్థ పేరు : ఇండియన్ కోస్ట్ గార్డ్ 
ఉద్యోగం పేరు :  నావిక్ 
ఉద్యోగాల వివరాలు
జనరల్ డ్యూటీ : 260 పోస్టులు 
డొమెస్టిక్ బ్రాంచ్ :  40 పోస్టులు 
అర్హతలు :  డొమెస్టిక్ బ్రాంచ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదవతరగతి పాస్ అయి ఉండియాలి, జనరల్ డ్యూటీ ఉద్యోగాలకు దరకాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్ మీడియట్ పాస్ అయి ఉండాలి .  
వయసు :  అభ్యర్థులకు వయసు 18 నుండి 22 సంవత్సరాల లోపు ఉండాలి. 
ఎంపిక విధానం :  దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కంప్యూటర్ ఆన్లైన్ ఎక్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫిజికల్ ఫిట్ నెస్ టెస్ట్, మెడికల్ ఎక్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. 
దరఖాస్తు విధానం : ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 11ఫిబ్రవరి 2025 నుండి 25 ఫిబ్రవరి 2025 లోపు క్రింద ఇచ్చిన లింక్ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 
దరఖాస్తు చేసుకోవడానికి :: https://joinindiancoastguard.cdac.in/cgept/selectionInformation/guidelines/fillingOnlineApplication