Karnataka Bank Jobs 2024 | కర్ణాటక బ్యాంక్ లో డిగ్రీతో జాబ్ కొట్టే ఛాన్స్

మంగుళూరు కేంద్రంగా  ఉన్న కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్ నుండి కస్టమర్ సర్వీస్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎంపికైన అభ్యర్థులు దేశంలో వివిధ కర్ణాటక బ్యాంక్ శాఖలలో పనిచేయవలసి ఉంటుంది అంతేకాకుండా ఈ సంస్థకు కనీసం మూడు సంవత్సరాలు పనిచేస్తామని బాండ్ కూడా ఇవ్వవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ క్రింద ఇచ్చిన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదివి ఈ ఉద్యోగాలకు 30 నవంబర్ 2024 లోపు దరఖాస్తు చేసుకోవాలి.  

సంస్థ పేరు :  కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్ 

ఉద్యోగం పేరు :  కస్టమర్ సర్వీస్ అసోసియేట్ 

అర్హతలు :  గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా గ్రాడ్యుయేషన్ 

వయసు : 01 నవంబర్ 2024 నాటికీ 26 సంవత్సరాలు మించకుండా ఉండాలి . ఎస్సి, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది 

అప్లికేషన్ ఫీజు :  దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జనరల్  మరియు ఒబిసి అభ్యర్థులు 700 రూపాయలు, ఎస్సి, ఎస్టీ అభ్యర్థులు 600 రూపాయలు ఫీజుగా చెల్లించాలి .  

ఎంపిక విధానం : అభ్యర్థులకు ఆన్లైన్ ఎక్జామ్ ద్వారా ఎంపిక చేస్తారు . పరీక్షా సెంటర్ లుగా హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ, కోల్ కతా, పూణే, మంగళూరు, హుబ్లీ, మైసూరు, శివ మొగ్గ, కలబుర్గి కేంద్రాలుగా ఉన్నాయి. ఈ పరీక్షను 15 డిసెంబర్ 2024 న నిర్వహిస్తారు. 

దరఖాస్తు విధానం :  ఆసక్తి ఉన్న అభ్యర్థులు కర్ణాటక బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ 30 నవంబర్ 2024 

నోటిఫికేషన్

ఆఫిసియల్ వెబ్సైట్