1. అలెగ్జాండర్ తర్వాత భారతదేశ లోపలి ప్రాంతా లపై దండయాత్ర చేసిన గ్రీకు రాజు?
ఎ) యూథిడిమస్
బి) యూక్రటైడ్స్
సి) డెమిట్రియస్
డి) మినాండర్
2. మహేశ్వర అనే బిరుదు పొందిన విదేశీ రాజు?
ఎ) కుజుల కాడ్ఫైసెస్
బి) ఆంటియాల్ సిదాస్
సి) వీమా కాడ్ఫైసెస్
డి) హెలియో డోరస్
3. వీమా కాడ్ఫైసెస్ ఆదరించిన శైవమత శాఖ?
ఎ) పాశుపతం
బి) కాపాలికం
సి) కాలాముఖం
డి) అఘోర శైవం
4. పాంచావొ అనే చైనా సేనాని చేతిలో ఓడిన కుషాణ చక్రవర్తి?
ఎ) కుజుల కాడ్ఫైసెస్
బి) కనిష్కుడు
సి) వీమా కాడ్ఫైసెస్
డి) హువిష్కుడు
5. కనిష్కుడు ఎవరి సలహా వల్ల కుందల వనంలో నాలుగో బౌద్ధ సంగీతిని నిర్వహించాడు?
ఎ) వసుమిత్రుడు
బి) అశ్వఘోషుడు
సి) శీలభద్రుడు
డి) పార్శ్వ
6. శివుడు, నంది గుర్తు కలిగిన నాణేలను జారీ చేసిన కుషాణ చక్రవర్తి?
ఎ) హువిష్కుడు
బి) వాసుదేవుడు
సి) రెండో కనిష్కుడు
డి) వశిష్కుడు
7. కశ్యపమాతంగ ఎవరి పాలనా కాలంలో చైనాలో బౌద్ధాన్ని ప్రవేశపెట్టారు?
ఎ) మౌర్యుల కాలంలో
బి) శుంగుల కాలంలో
సి) శకుల కాలంలో
డి) కుషాణుల కాలంలో
8. మహారాజ మహాత్మా అనే బిరుదున్న శకరాజు?
ఎ) రుద్ర దమనుడు
బి) భూమకుడు
సి) మోగా
డి) నహపాణుడు
9. అభిషేక లక్ష్మీ అనే భారతీయ దేవతను తన నాణేలు పై ముద్రించిన శకరాజు?
ఎ) చష్టానుడు
బి) ఏజెస్
సి) నహపాణుడు
డి) అజిలిసెస్
10. 'పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ' గ్రంథంలో మం బారాస్ అనే పేరుతో ఎవరిని పేర్కొన్నారు?
ఎ) మిళిందుడు
బి) నహపాణుడు
సి) రుద్ర దమనుడు
డి) భూమకుడు
11. తన నాణేల మీద గ్రీకు, ఖరోష్టి, బ్రాహ్మీ లిపు లను ఉపయోగించిన శకరాజు?
ఎ) చష్టానుడు
బి) భూమకుడు
సి) మోగా
డి) రుద్రదమనుడు
12.మహాక్షాత్రప అనే బిరుదు పొందిన రాజు?
ఎ) నహపాణుడు
బి) రుద్రదమనుడు
సి) ఉషవదత్తుడు
డి) భూమకుడు
13. భారతదేశంలో తొలి సంస్కృత శాసనాన్ని ఎవరి కాలంలో జారీ చేశారు?
ఎ) సముద్రగుప్తుడు
బి) కనిష్కుడు
సి) రుద్రదమనుడు
డి) గౌతమీపుత్ర శాతకర్ణి
14. ధర్మతిడ, సచధర్మతిడ అనే బిరుదులు ఉన్న కుషాణ చక్రవర్తి?
ఎ) కనిష్కుడు
బి) హువిష్కుడు
సి) కుజుల కాడ్ఫైసెస్
డి) వీమా కాడ్ఫైసెస్
15. సెల్యూసిడ్ రాజు 2వ ఆంటియోకస్ చేతిలో ఓడిన భారతీయ రాజు?
ఎ) సుభాగ సేనుడు
బి) బిందుసారుడు
సి) భాగభద్రుడు
డి) పుష్య మిత్రుడు
0 Comments
కామెంట్‌ను పోస్ట్ చేయండి