RTC Driver Jobs | రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ లో డ్రైవర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

 తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుండి డ్రైవర్  ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1201 డ్రైవర్  ఉద్యోగాల ను  భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలను కేవలం కాంట్రాక్ట్ పద్దతిలో మాత్రమే భర్తీ చేస్తున్నారు. ఇవి మాజీ సైనిక ఉద్యోగులు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఈ ఉద్యోగాలను ఎటువంటి రాత పరీక్షా లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హులైన మాజీ సైనిక ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 30 నవంబర్ 2024. పూర్తి వివరాలకోసం క్రింద ఇచ్చిన ఆర్టికల్ ను పూర్తిగా చదవలగలరు.  

సంస్థ పేరు :   తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ 

ఉద్యోగం పేరు :  డ్రైవర్ 

మొత్తం ఖాళీల సంఖ్య :  1201 పోస్టులు 

అర్హతలు : అభ్యర్థులు తప్పనిసరిగా మాజీ సైనిక ఉద్యోగి అయి ఉండాలి. హెవీ డ్యూటీ లైసెన్స్ తో పాటు కనీసం 18 నెలల అనుభవం ఉండాలి . 

వయసు పరిమితి :  దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వయసు నవంబర్ 30 వ తేదీ నాటికి 58 సంవత్సరాలు మించకుండా ఉండాలి. 

దరఖాస్తు విధానము: అర్హతలు ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారం తో పాటు అవసరమైన పత్రాలను జతపరిచి porsb-ts@nic.in లేదా  emprsb-ts@nic.in అనే ఇమెయిల్ చిరునామాకు 30 నవంబర్ 2024 లోపు పంపించాలి. లేదా అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారాలను ది డైరెక్టర్, సైనిక్ వెల్ఫేర్ ప్లేసెమెంట్ ఆఫీసర్, తెలంగాణ స్టేట్ సైనిక్ వెల్ఫేర్ బోర్డు, హైదరాబాద్, తెలంగాణ అనే చిరునామాకు 30 నవంబర్ 2024 లోపు చేరునట్లు పోస్టు ద్వారా కూడా పంపించవచ్చు.