తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గ్రామీణ బ్యాంకులలో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 30 నవంబర్ 2024 లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలు కేవలం ఒక సంవత్సర కాలానికి మాత్రమే భర్తీ చేసే కాంట్రాక్ట్ ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్షా లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే భర్తీ చేస్తారు. కాబట్టి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆఫ్ లైన్ విధానం లో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి సమాచారం కోసం క్రింద ఇచ్చిన ఆర్టికల్ ను పూర్తి గా చదివి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ పేరు : తెలంగాణ డి సి సి బి
ఉద్యోగం పేరు : కో ఆపరేటివ్ ఇంటర్న్
మొత్తం ఖాళీల సంఖ్య : 10 పోస్టులు
ఉద్యోగాల వివరాలు :
1) కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ , హైదరాబాద్ - 01 పోస్టు
2) డిస్ట్రిక్ట్ సెంట్రల్ కో ఆపరేటివ్ బ్యాంక్స్ - 09 పోస్టులు
విద్యార్హతలు : మార్కెటింగ్ మేనేజ్మెంట్ / కో ఆపరేటివ్ మేనేజ్మెంట్ / అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ . రురల్ డెవెలప్మెంట్ మేనేజ్మెంట్ లలో ఎం బి ఏ పూర్తి చేసి ఉండాలి మరియు కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి.
వయసు : దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వయసు 21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోపు ఉండాలి
జీతం : ఎంపికైన అభ్యర్థులకు నెలకు 25 వేల రూపాయల వేతనంతో పాటు టి ఏ , డి ఏ ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం : ఆసక్తి , మరియు అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు తమ దరఖాస్తు ఫారాలను The Deputy General Manager, Human Resource Management Department, The Telangana State Cooperative Bank Ltd., #4-1-441, Troop Bazar,Hyderabad – 500 001. అనే చిరునామాకు 30 నవంబర్ 2024 లోపు చేరునట్లు పోస్టు ద్వారా పంపించాలి.
0 Comments
కామెంట్‌ను పోస్ట్ చేయండి