కేంద్ర ప్రభుత్వ రంగ మినీ రత్న కంపెనీ అయిన EDCIL నుండి ఆంధ్ర ప్రదేశ్ లోని సమగ్ర శిక్ష పాఠశాలలో పనిచేయడానికి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 257 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలు కేవలం కాంట్రాక్ట్ పద్దతిలో మాత్రమే భర్తీ చేస్తున్నారు. ఇవి పర్మినెంట్ ఉద్యోగాలు కాదు. ఎంపికైన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపిక చేసిన సమగ్ర శిక్ష పాఠశాలలో పనిచేయవలసి ఉంటుంది. ఈ ఉద్యోగాలు 30 ఏప్రిల్ 2025 వరకు మాత్రమే ఉంటాయి ఆ తరువాత అభ్యర్థి యొక్క పెరఫార్మెన్స్ ను బట్టి , అవసరాన్ని బట్టి మరో సంవత్సరం అంటే 01 ఏప్రిల్ 2026 వరకు పొడిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే ముందుగా క్రింద ఇచ్చిన సమాచారం పూర్తిగా చదివి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
సంస్థ పేరు : EDCIL
ఉద్యోగాల సంఖ్య : 257 పోస్టులు
పోస్టుల వివరాలు :
1) కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సెలర్ - 255 పోస్టులు
2) PMUమెంబర్స్ /కో ఆర్డినేటర్లు - 02 పోస్టులు
అర్హతలు :
1) కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సెలర్ - ఎంఎస్సి / ఎం ఏ లో సైకాలజీ మరియు సంబంధిత విభాగంలో ఐదు సంవత్సరాల అనుభవం
2) PMUమెంబర్స్ /కో ఆర్డినేటర్లు - సైక్రటిక్స్ సోషల్ వర్క్ లో ఎం ఎస్సి / ఎం ఫీల్ మరియు సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి
వయసు పరిమితి : 30 సెప్టెంబర్ 2024 నాటికీ కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సెలర్ ఉద్యోగాలకు 35 సంవత్సరాల లోపు ఉండాలి, PMUమెంబర్స్ /కో ఆర్డినేటర్లు ఉద్యోగాలకు 45 సంవత్సరాలు మించకుండా ఉండాలి
ఎంపిక విధానం : దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అకడమిక్ మరియు అనుభవం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని షార్ట్ లిస్ట్ చేస్తారు తరువాత రాత పరీక్షా మరియు ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం : ఆసక్తి , అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 19 నవంబర్ 2024 నుండి 03 డిసెంబర్ 2024 లోపు కేంద్ర ప్రభుత్వ రంగ మినీ రత్న కంపెనీ అయిన EDCIL యొక్క అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
0 Comments
కామెంట్‌ను పోస్ట్ చేయండి