AP Transco Jobs | ఆంధ్ర ప్రదేశ్ కరెంట్ ఆఫీస్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

 ఆంధ్ర ప్రదేశ్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్, విద్యుత్ సౌధ, విజయవాడ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్ పద్దతిలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఒక సంవత్సరం కాలానికి మాత్రమే కాంట్రాక్ట్ పద్దతిలో భర్తీ చేస్తున్నారు. ఈ కాలంలో ఎంపికయిన అభ్యర్థులకు నెలకు లక్ష ఇరవై వేల రూపాయల వేతనం ఇవ్వనున్నారు. కాబట్టి ఆసక్తి, అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు క్రింద ఇచ్చిన నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోవచ్చు.  

సంస్థ పేరు :   ఆంధ్ర ప్రదేశ్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్

ఉద్యోగాల సంఖ్య :  05 పోస్టులు 

ఉద్యోగం పేరు :  కార్పొరేట్ లాయర్ 

ఉద్యోగాల వివరాలు :  

1) APTRANSCO - 01 పోస్టు 

2) APPCC - 04 పోస్టులు 

అర్హతలు : అభ్యర్థులు మూడు సంవత్సరాల ఎల్ ఎల్ బి లేదా ఎల్ ఎల్ ఎం  లేదా ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ లా కోర్స్ పూర్తి చేసి ఉండాలి.   కనీసం 04 సంవత్సరాల నుభవం ఉండాలి .  ఈ ఉద్యోగాలకు ఎటువంటి వయసు పరిమితి లేదు 

ఎంపిక  విధానం :  దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారు. ఎంపికైన  వారికీ నెలకు లక్ష ఇరవై వేల రూపాయల వేతనం ఉంటుంది. 

దరఖాస్తు విధానం :  అర్హతలు ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ లో ఇచ్చిన దరఖాస్తు ఫారం పూర్తి చేసి అవసరమగు  పత్రాలను జతపరిచి వాటిని ది ఛైర్మెన్ & మేనేజింగ్ డైరెక్టర్, APTRANSCO , విద్యుత్ సౌధ , గుణదల, విజయవాడ - 520004 అనే చిరునామాకు నోటిఫికేషన్ విడుదల తేదీ (19-11-2024) అయిన తరువాత 21 రోజుల లోపు దరఖాస్తు లు పోస్టు ద్వారా పంపించాలి.