ఫ్రీగా ఫుడ్డు, బెడ్డు, ట్రెయినింగ్...వ్యాపారానికి లోన్...నిరుద్యోగులకు బంపర్ ఆఫర్..SBI Rural Self Employment Training Institutes (RSETIs)

ఉద్యోగమా లేదా స్వయం ఉపాధా...ఇలా రెండింటిలో దేన్ని ఎంపిక చేసుకోవాలో తెలియక యువత నేడు సతమతం అవుతున్నారు. నేటీ పోటీ ప్రపంచంలో చదువు పూర్తికాగానే ఉద్యోగం రావడం అంత తేలికైన విషయం కాదు! ఒక ఉద్యోగానికి వేల మంది పోటీ పడుతున్నారు. నిరుపేదలు, ఉన్నత విద్యను అభ్యసించలేని చాలా మందికి నేడు స్వయం ఉపాధే దిక్కు అవుతోంది. వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకుని స్వశక్తితో ముందుకు సాగే ఉత్సాహం ఉన్న యువతీ, యువకులకు స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా బాసటగా నిలుస్తోంది. 
దేశ వ్యాప్తంగా 587 శిక్షణా సంస్థలు కలిగి, గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగులకు శిక్షణ ఇస్తున్న సంస్థల్లో (SBI RSETI) ముందు స్థానంలో ఉంది. స్వయం ఉపాధి శిక్షణా కార్యక్రమాలను నిపుణుల ఆధ్వర్యంలో నిర్వహిస్తోంది. దేశంలోని గ్రామీణ యువత నిరుద్యోగం మరియు ఉపాధి కోల్పోయే సమస్యను పరిష్కరించడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా 151 గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థలను ఏర్పాటు చేసింది.