How to Start Adhaar Enrollment Center | Telugu Self Employment Ideas for Small Business

ఆధార్ కార్డ్... ప్రతీ ఒక్కరికీ అవసరమైన డాక్యుమెంట్ ఇది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI జారీ చేసే ఆధార్ కార్డ్ ఐడీ ప్రూఫ్‌గా మాత్రమే కాదు... ప్రభుత్వ పథకాలకు కావాల్సిన ముఖ్యమైన ప్రూఫ్‌గా మారింది. కొత్త ఆధార్‌ తీసుకోవాలన్నా, ఇప్పుడు ఉన్న ఆధార్‌లోనే ఏవైనా మార్పులు చేయాలన్నా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌కు వెళ్లాల్సిందే. 
UIDAI నియమనిబంధనలకు అనుగుణంగా ఎన్‌రోల్‌మెంట్ సెంటర్లు నడుచుకుంటాయి. ఈ ఎన్‌రోల్‌మెంట్ ఏజెన్సీలను రిజిస్ట్రార్లు నియమిస్తారు. పౌరుల బయోమెట్రిక్, డెమొగ్రఫిక్ డేటా సేకరిస్తుంటాయి. దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్లు ఉన్నాయి.