Cotton Wicks Making Low Investment Home Business Idea in Telugu Self Employment | Vattula Tayari

దీపం వెలిగే ఇంట్లో లక్ష్మీదేవి కొలువుంటుందంటారు. నిత్యం ఒక్క దీపమైనా ముట్టించని హిందువుల ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. అందుకే హిందువుల ఇళ్లలో ప్రతి రోజు దీపాలు వెలిగిస్తారు, ఉదయాన్నే దీపాలు పెట్టేవాళ్లు కొందరైతే... రోజుకు రెండు పూటలా ఉదయం, సాయంత్రం  దీపాలు వెలిగించి  దేవుడిని కొలిచేవాళ్లు మరికొందరు.
 ఏది ఏమైనా నిత్యం ప్రతి ఇంట్లో దీపం వెలగడం అనేది మామూలే. ఈ దీపమే మన వ్యాపారానికి వెలుగులనూ ప్రసాదిస్తుంది. అదే మనకు  నెలకు లక్ష రూపాయలు సంపాదించే ఆదాయ మార్గాన్ని చూపిస్తోంది. అదెలాగో తెలుసుకుందాం