Small Investment High Profit Chicken Dum Biryani Business Telugu Self Employment

డబ్బు సంపాదించాలి అనే ఆలోచన ఉండాలే కానీ బోలెడంత మార్కెట్ మన్న కళ్ల ఎదుటే ఉంది అయితే చేసే పనిలో కొత్త కాన్సెప్ట్ ఉంటే చాలు సక్సెస్ మీ వెంటే ఉంటుంది. చదువు ఏదయినా పరవాలేదు బిజినెస్ అయితే బెస్ట్ అని ఎక్కువ మంది యువకులు నేడు బిజినెస్ వైపే మొగ్గు చూపుతున్నారు.  పెద్ద పెద్ద చదువులు చదివిన విద్యార్థులు కూడా ఉద్యోగాలు చెయ్యకుండా ఫుడ్ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసి మంచి లాభాలు పొందుతున్నారు. అంతే కాదు తమతో పాటు నలుగురికి ఉపాధి కల్పిస్తున్నారు. 
అయితే ఇఫ్పుడు తాజాగా ఫుడ్ బిజినెస్ లో బిర్యానీ(Dum Biryani) సెంటర్లు చక్కటి ఆదాయం అందిస్తున్నాయి. తక్కువ పెట్టుబడితో, తక్కువ సమయంలో మంచి ఆదాయం బిర్యానీ సెంటర్ల ద్వారా యువత పొందుతున్నారు.