Local Small Business Ideas in Telugu | How to Start Banion Making Business Most Profitable business

మహిళలు ఇష్టపడి చేసే పనుల్లో కుట్టుపని ఒకటి. తక్కిన లోదుస్తుల తయారీతో పోలిస్తే బనియన్ల తయారీ సులువనే చెప్పాలి. కత్పరింపు తేలిక. ఐరనింగ్, కుట్టు వంటి తక్కువ దశల్లో పని పూర్తవుతుంది. ఈ పరిశ్రమను మహిళలు తేలిగ్గా నిర్వహించుకోవచ్చు. 
చిన్నారుల నుంచి పెద్దల వరకూ అవసరమైన బనియన్ల తయారీకి ఎంత పెట్టుబడి అవసరం అవుతుందో చూద్దాం.  బనియన్ ల తయారీకి ఉపయోగించే వస్త్రం పేరు నిట్టెడ్ ఫాబ్రిక్ . ఇది తెలుపు రంగులోనే కాకుండా రకరకాల రంగుల్లో అందుబాటులోకి వస్తోంది. దాంతో రంగుల బనియన్లను కుట్టవచ్చు .