పభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి సెంట్రల్ బ్యాంక్ అఫ్ ఇండియా వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 09 ఫిబ్రవరి 2025 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. సెంట్రల్ బ్యాంక్ అఫ్ ఇండియా అనేది ప్రభుత్వ రంగ బ్యాంక్ దీనికి దేశవ్యాప్తంగా 4500 బ్రాంచ్ లు ఉన్నాయి అలాగే 33000 మంది సిబ్బంది ఉన్నారు. ఈ బ్యాంక్ నందు జోన్ బేస్డ్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది.
ఉద్యోగం పేరు : జోన్ బేస్డ్ ఆఫీసర్
మొత్తం ఖాళీల సంఖ్య : 266 పోస్టులు
ఉద్యోగాల వివరాలు :
1) అహ్మదాబాద్ జోన్ : 123 పోస్టులు
2) చెన్నై జోన్ : 58 పోస్టులు
3) గౌహతి జోన్ : 43 పోస్టులు
4) హైదరాబాద్ జోన్ : 42 పోస్టులు
అర్హతలు : ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పాస్ అయి ఉండాలి. లేదా అభ్యర్థులు మెడికల్, ఇంజనీరింగ్, చార్టెడ్ అకౌంటెంట్ , కాస్ట్ అకౌంటెంట్ పాస్ అయినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఏదైనా ఫైనాన్సియల్ సెక్టార్ లో పనిచేసిన వారికీ ప్రాధాన్యత ఉంటుంది.
వయసు పరిమితి : 30 నవంబర్ 2024 నాటికీ 21 సంవత్సరాల నుండి 32 సంవత్సరాల మధ్య ఉండాలి. అలాగే రిజర్వేషన్ ల ప్రకారం కేటగిరి వర్గాల వారికీ వయసు పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపికైన అభ్యర్థులకు రెండు సంవత్సరాల ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. అభ్యర్థులు 3 లక్షల పూచికత్తు మరియు మూడు సంవత్సరాల బాండ్ సమర్పించాలి.
ఎంపిక విధానం : అభ్యర్థులకు రాత పరీక్షా మరియు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్,గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, నగరాలలో పరిక్ష నిర్వహిస్తారు.
ఫీజు : దరఖాస్తు ఫీజు జనరల్ కేటగిరి అభ్యర్థులకు 850 మరియు జీఎస్టీ, ఎస్సి, ఎస్టీ, పిడబ్ల్యూడీ అభ్యర్థులు మరియు మహిళలకు 17 మరియు జీఎస్టీ చెల్లించాలి.
దరఖాస్తు విధానం : అభ్యర్థులు తమ దరఖాస్తులను బ్యాంక్ యొక్క అధికారిక వెబ్సైట్ ద్వారా 21 జనవరి 2025 నుండి 09 ఫిబ్రవరి 2025 లోపు దరఖాస్తు చేసుకోవాలి.
0 Comments
కామెంట్‌ను పోస్ట్ చేయండి