ఈ సమోసా చిన్నదే కానీ ఆదాయం పెద్దగా ఉంటుంది. ఆదాయం అంటే మరీ కోట్లలో వ్యాపారం కాకపోయినా ఓక సగటు ఉద్యోగి జీతం కంటే ఎక్కువే ఈ బిజినెస్ లో సంపాదించొచ్చు. అందుకే ఈ రోజు ఈ వీడియోలో మనం సమోసా తయారీ బిజినెస్ గురించి తెలుసుకుందాం.
సమోసాలలో మనకు చాలా రకాలు ఉంటాయి. ఆలూ సమోసా అంటే అందరికీ ఇష్టమే. కానీ చిన్నసైజు సమోసాలకే ఫ్యాన్స్ ఎక్కువ. ఏ చిన్నహోటల్‌కు వెళ్లినా అక్కడ ఈ చోటా సమోసా కనిపిస్తుంది. ఛాయ్ బండి దగ్గర పిచ్చాపాటి కబుర్లు చెప్పుకొనేవాళ్లు, కుటుంబంతో సరదాగా బయటికి వచ్చి తినేవాళ్ళు నగరాలలో, పట్టణాలలో చాలా మందే ఉన్నారు. వాళ్లందరికీ కావాల్సింది ఇలాంటి స్నాక్సే. ఒక చేత్తో ఆనియన్ సమోసా, ఇంకో చేతిలో గరమ్ గరమ్ ఛాయ్ ఇలాంటి కాంబినేషన్ కోసమే ఈ చోటా సమోసాలకు బాగా డిమాండ్ పెరిగింది.
0 Comments
కామెంట్‌ను పోస్ట్ చేయండి