ఈ బిజినెస్ గురించి తెలుగులో లేదు వెంటనే స్టార్ట్ చేయండి నెలకు ఈజీగా 30,000 సంపాదన

కేంద్ర ప్రభుత్వం కొత్త మోటారు వాహన చట్టాన్ని అమలు చేసినప్పటి నుండి, పొల్యూషన్ టెస్టింగ్ సెంటర్లకు డిమాండ్ ఆమాంతం పెరిగింది. దీంతో కొత్త మోటారు వాహన చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత pollution under control అంటే పియుసి అనేది చాలా అవసరమైన పత్రంగా మారింది.  

ఈ కాలుష్య ధృవీకరణ పత్రం మన దగ్గర లేకపోతే గరిష్టంగా రూ.10 వేల జరిమానా విధించేందుకు కొత్త మోటారు వాహన చట్టం వల్ల వీలుకలిగింది. దీంతో ఇప్పుడు ప్రతీ ఒక్కరూ పొల్యూషన్ టెస్టింగ్ చేయించుకోవడం తప్పనిసరి అయ్యింది. ఇటువంటి పరిస్థితిలో, మీరు కూడా ఈ పొల్యూషన్  టెస్టింగ్ సెంటర్ ప్రారంభించడం ద్వారా మంచి ఆదాయం సంపాదించవచ్చు. సొంత వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తున్న యువతకు ఈ వ్యాపారం చాలా లాభదాయకంగా ఉంటుంది.