Used Tyres Rethred Business | Best Business Ideas in Telugu

ప్రస్తుతం మన దేశంలో  ప్రజల కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిన కారణంగా చాలామంది బైక్స్ నే కాకుండా కార్లను కూడా కొనడానికి మొగ్గుచూపుతున్నారు. 2 లక్షల నుండే కార్లు లభ్యమవుతున్న నేపథ్యంలో ప్రతి సంవత్సరం కార్స్ సేల్స్ విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ రోజు ఈ వీడియోలో వాహనాల టైర్లు రెట్రేడింగ్ వ్యాపారం గురించి తెలుసుకుందాం

టైర్స్ కి డ్యామేజ్ అయినా ప్రతిసారి కొత్త టైర్స్ మార్చాలంటే చాలా ఖర్చు అవుతుంది. అందులోనూ బస్సులు, లారీలు, ట్రక్కులు వంటి పెద్ద వాహనాల టైర్స్ ను మార్చాలంటే మరింత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందువలన టైర్స్ ను మార్చకుండా వాటిని రీ-త్రెడింగ్ చేసినట్లయితే వాహనదారులకు భారం తగ్గుతుంది.  అలాగే రోజురోజుకి ఒరిజినల్ టైర్స్ ఖరీదు కూడా పెరగుతుండడంతో కూడా ఈ టైర్స్ రీ-త్రెడింగ్ బిజినెస్ కి డిమాండ్ పెరగడానికి కారణమని చెప్పవచ్చు. కాబట్టి ఈ టైర్స్ రీ-త్రెడింగ్ ని మన ఆదాయ వనరుగా మార్చుకుని స్వయం ఉపాధి పొందవచ్చు.