ఈ రోజుల్లో ఏదైనా చిన్న వ్యాపారం చేయాలన్నా లక్షల రూపాయల్లో పెట్టుబడి పెట్టాల్సిందే. అంత పెట్టుబడి పెట్టినా అతి తక్కువ సమయంలో లాభం అధికంగా వస్తుందా అంటే దాన్ని చెప్పడం కూడా కష్టమే. ప్రస్తుత పోటీ ప్రపంచంలో అతి తక్కువ పెట్టుబడి పెట్టి అత్యంత ఎక్కువ ఆదాయం పొందాలని చాలా మంది ఆశిస్తుంటారు. అలాంటి వారి కోసం ఈ రోజు ఈ వీడియోలో మా ఛానల్ తరఫునుండి ఒక చిన్న బిజినెస్ ఐడియా చెప్తాను,ఈ బిజినెస్ ను మీరు కేవలం 500 రూపాయల లోపే మీ ఇంట్లోనే ప్రారంభించవచ్చు. ఆ బిజినెస్ ఏంటంటే సున్నం తయారీ వ్యాపారం.
సున్నం అంటే పాన్ లో వేసేది. దీనిలో ఏ గ్రేడ్ సున్నం కావాలి, ఇది మార్కెట్లో చాలా చోట్ల లభిస్తుంది. లేదా ఆన్లైన్ లో అయినా మీరు కొనుక్కోవచ్చు, ఇది ఒక కేజీ మనకు కేవలం 15 రూపాయలకు లభిస్తుంది, ఇంకా ఒక ప్లాస్టిక్ డ్రమ్ము మరియు వీటిని ప్యాకింగ్ చేసుకోవడానికి కవర్లు లేదా చిన్న చిన్న డబ్బాలు అవసరం అవుతాయి. ఈ కవర్లు లేదా ప్లాస్టిక్ డబ్బాలకు మరో 100 రూపాయలు వరకు ఖర్చవుతుంది
0 Comments
కామెంట్‌ను పోస్ట్ చేయండి