కుందేళ్ల పెంప‌కం | How to Start Rabbit Farming Business 2020

చికెన్‌, మ‌ట‌న్‌తోపాటు ప్ర‌స్తుతం కుందేలు మాంసానికి కూడా గిరాకీ బాగా పెరిగింది. అందువ‌ల్ల వాటిని పెంచి విక్ర‌యిస్తే.. చ‌క్క‌ని ఆదాయం పొంద‌వ‌చ్చు. ప్ర‌స్తుత0 అధిక శాతం మంది కోళ్లు, మేకలు , గొర్రెలతోపాటు కుందేళ్ల‌ను కూడా పెంచి చ‌క్క‌ని లాభాల‌ను పొందుతున్నారు. కుందేళ్ల పెంపకం ఇప్పుడు చ‌క్క‌ని ఆదాయ వ‌న‌రుగా కూడా మారింది. ఇంటి వ‌ద్ద స్థ‌లం ఉన్న‌వారు కుందేళ్ల‌ను చాలా సుల‌భంగా పెంచ‌వ‌చ్చు. స్థ‌లం లేక‌పోయినా.. లీజుకు తీసుకుని మ‌రీ వాటిని పెంచితే వ్యాపారం లాభ‌సాటిగా మారుతుంది.
అయితే కుందేళ్ల పెంప‌కం చేయాలంటే.. ముందుగా ఆ మార్కెట్‌పై అవ‌గాహ‌న ఉండాలి. కుందేళ్ల‌ను ఎక్క‌డ కొంటారు, ఎక్క‌డ వాటిని పెంచితే అనువుగా ఉంటుంది, వాటిని ఎలా ర‌వాణా చేయాలి, ఎక్క‌డ వ్యాపార అవ‌కాశాలు ఉంటాయి.. త‌దిత‌ర అంశాల‌ను ఒక్క‌సారి పూర్తిగా తెలుసుకోవాలి. ఆ త‌రువాతే వాటి పెంప‌కం చేప‌ట్టాలి. దీంతో సుదీర్ఘ‌కాలం పాటు ఈ బిజినెస్‌లో చ‌క్క‌ని లాభాల‌ను పొంద‌వ‌చ్చు.