How to Start Kadhaknath Poultry Business | Small Business Ideas Telugu

బిజినెస్ పరంగా మంచి డిమాండ్ ఉన్న మధ్యప్రదేశ్ కోళ్ల పెంపకం గురించి తెలుసుకుందాం వీటినే కథక్ నాధ్ కోళ్లు అని కూడా అంటారు. జుట్టు నుండి కాళ్ళ వరకు శరీరం నలుపురంగు కలిగి రక్తం, మాంసం ఎముకలు, గుడ్లు కూడా నలుపురంగులో ఉండటంతో వీటిని కొన్ని ఏరియాలలో కాలీమసీ, నల్లకోడి అని కూడా పిలుస్తారు. 
తూర్పు మధ్యప్రదేశ్‌లోని జబు, థార్‌ జిల్లాల్లోని గిరిజనుల ఇళ్ళలో సాంప్రదాయంగా ఈ కోళ్లు పెంచుతుంటారు. అయితే మామూలు బ్రాయిలర్ కోళ్ళకన్నా ఈ కధాకనాథ్ కోట్లలో  ఔషద గుణాలు ఎక్కువగా ఉండటంతో మన తెలుగు రాష్ట్రాలలో కూడా వీటికి డిమాండ్ బాగా ఉంది కాబట్టి   వీటి మాంసానికి విపరీతమైన గిరాకి. అయితే వీటితో వ్యాపారం కొంచెం ఓపిక చేయాలి. ఇక ఈ కథక్ నాథ్ కోళ్ల వ్యాపారానికి సంబంధించిన అన్ని వివరాలను తెలుసుకుందాం.