గ్రామాలలో చేయగలిగే లాభసాటి బిజినెస్ | Neem Oil Business

ప్రస్తుతం మన ఆధునిక సమాజంలో మనం వాడే సబ్బు దగ్గర నుండి  ప్రతి ఒక్కటి కెమికల్స్ తో తయారు చేయబడుతోంది, దీని వలన మనం చాలా అనారోగ్యాలు కొని తెచుకుంటున్నాం. అందుకే ఇలా అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకు చాలామంది సహజంగా ఉన్నవాటిని వాడేందుకు ఆసక్తి చూపుతున్నారు. 
ఇలా ఉపయోగించే వాటిలో వేపనూనెను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ వేప నూనెని కాస్మొటిక్స్ లో అంటే హెయిర్ కేర్, బాడీకేర్, స్కిన్ కేర్ ఇలా మొదలగు వాటిలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇవే కాకుండా వ్యవసాయపరంగా, మెడికల్ పరంగా కూడా దీనిని ఎక్కువగా వాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు  మనం వేపనూనె తయారీ బిజినెస్ గురించి తెలుసుకుందాం .