How to make Plastic Rice Bags Business Telugu Self Employment Small Business | Jute Bags Business

ప్లాస్టిక్ బ్యాగులను ఎలా తయారు చేస్తారు, వాటి మీద ఎలా ప్రింటింగ్ వేస్తారు అనే విషయాలు తెలుసుకుందాం  ఈ ప్లాస్టిక్ బ్యాగులను మనం బియ్యం, ఎరువులు, సిమెంట్, ఆహార పదార్థాలు అంటే చక్కర, కంది బేడలు ఇలా ఒక్కటేమిటి ప్రతి ఒక్కటి ఈ ప్లాస్టిక్ బ్యాగులలోనే నింపి విక్రయిస్తున్నారు, కాబట్టి వీటికి చాలా చాలా డిమాండ్ ఉంది,
ఈ రైస్ బ్యాగుల తయారీకి మనకు మూడు రకాల మిషన్ లు కావలసి ఉంటుంది, అవి ఒకటి కటింగ్ మెషిన్, రెండు స్టిచ్చింగ్ మెషిన్, మూడు ప్రింటింగ్ మెషిన్ .  అలాగే వీటితో పాటు రా మెటీరియల్ క్రింద మనకు Polypropylene cover bundle కూడా కావాలి మనం బ్యాగ్ యొక్క మందాన్ని మైక్రోన్స్  లో కొలుస్తాం కాబట్టి  ఇది మనకు దాని యొక్క మైక్రోన్స్ ను బట్టి 130 రూపాయల నుండి 200 రూపాయల వరకు ఉంటుంది, రైస్ బ్యాగ్ ఏ విధంగా తయారు చేస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం