Small Investment High Profit Most Demanding Business | Telugu Self Employment Small Business Ideas

పిండి కొద్ది రొట్టె అన్నారు పెద్దలు. అలాగే ఏ వ్యాపారంలో నైనా మనం పొందే లాభాలు అనేవి మనం పెట్టే పెట్టుబడి మీదనే ఆధారపడి ఉంటాయి. ఒక్కోసారి మనం ప్రారంభించే వ్యాపారానికి పెట్టుబడి ఎక్కువ అవుతుందేమో అని వెనుకడుగు వేస్తుంటాం. అయితే మనం కనుక చక్కగా మార్కెటింగ్ చేయగలిగితే మన వ్యాపారం వల్ల వచ్చే లాభాలు ఊహకందని విధంగా ఉంటాయి. 
ఇప్పుడు చెప్పబోయే వ్యాపారం కూడా అదే కోవలోకి వస్తుంది. ఏంటా ఆ వ్యాపారం అని ఆలోచిస్తున్నారా, అదేనండి నిర్మాణ రంగంలో మంచి డిమాండ్ ఉన్న "పార్కింగ్ టైల్స్ మేకింగ్ బిజినెస్". ప్రస్తుతం మన దేశం నిర్మాణ రంగంలో దూసుకుపోతుంది. ఇక కొత్తగా ఏర్పడిన తెలుగురాష్ట్రాల సంగతి అయితే చెప్పనవసరం లేదు.