దోశ మెషిన్ తో రోజు 5000 వరకు సంపాదన | Self Employment Telugu | Local Small Business Ideas

ఎలాంటి కష్టం లేకుండా ఒక్క బటన్ నొక్కితే కోరుకున్న రుచిలో,
కోరుకున్న సైజులో దోశలు మీ ముందు ప్రత్యక్షమవుతాయి. ఆటోమెటిక్ దోశ మెషీన్ స్పెషాలిటీ. 

ఈ మెషీన్ తో చిన్న సైజు అవుట్ లెట్ తో ప్రారంభించవచ్చు. దీని కోసం మాస్టర్ అవసరం లేదు. మీరే స్వయంగా ఆపరేట్ చేసుకోవచ్చు. ఒక్కసారి లక్షన్నర పెట్టుబడి పెడితే చాలు రోజుకు 500 దోశలు ఈజీగా సప్లయ్ చేయవచ్చు. దీనికి ముందు మనం చేయాల్సిందల్లా ఒకటే. మనకు దోశ ఏ సైజులో కావాలి, ఎంత మందం ఉండాలి. ఎంత రోస్టు కావాలి అని సెట్ చేయడం తెలుసుకోవడమే. అంతేకాదు ఫ్యాట్ ఫ్రీ దోశను కూడా ఈ మెషీన్ తో తయారు చేసుకోవచ్చు.

రకరకాల దోశలు చిటికెలో... ఈ మిషతో 50 రకాల దోశలు చిటికెలో తయారు చేసుకోవచ్చు. వీటి కోసం చేయాల్సిందంతా సెట్టింగ్ మాత్రమే. ఎలా అంటే కలిపిన దోశపిండిని, నూనెను వేయడానికి విడివిడిగా ఇందులో బాక్సులుంటాయి. వాటిల్లో సరిపడా ఇవి వేసుకుని సెట్ చేసుకోవాలి. దోశ పోయడం, మడతపెట్టడం అంతా మెషీనే చూసుకుంటుంది.