Pragna General Knowledge and Current Affairs || Telugu Science Bits for Competitive Exams


*📕SCIENCE BITS🌎📚*

*1) మొదటిసారిగా అణు రియాక్టర్ ను నిర్మించింది ఎవరు?*
ఎ) ఫెర్మి
బి) ఫారెస్ట్
సి) ఫారడే
డి) అండర్ సన్

*2) సబ్ మెరైన్ ను కనుగొన్నది ఎవరు ?*
ఎ) కాస్టన్
బి) బుష్ నెల్
సి) గిల్లెట్
డి) గేట్టింగ్

*3) హైడ్రోజన్ బాంబ్ ఏ సూత్రం పై ఆధారపడి పని చేస్తుంది ?*
ఎ) కేంద్రక విచ్చిత్తి
బి) బాయిల్
సి) కేంద్రక సంలీనం
డి) ఏదీకాదు

*4)ఆధునిక భౌతిక శాస్ర పితామహుడు ఎవరు ?*
ఎ) ఐన్ స్టీన్
బి) మాక్స్ ప్లాంక్
సి) మాక్స్ వెల్
డి) గెలీలియో

*5) ఎలక్ట్రాన్ ను కనుగొన్న శాస్త్రవేత్త ?*
ఎ) జి.పి.థామ్సన్
బి) జె.జె. థామ్సన్
సి) హెన్రీ బెకరల్
డి) సి.వి రామన్

*6) 'BRABO' గా పిలిచే పారిశ్రామిక రంగంలో* *ఉపయోగించే బ్రావో రోబో ను ఏ సంస్థ తయారు చేసింది ?*
ఎ) శస్త్ర రోబోటిక్స్
బి) TAL మాన్యుఫాక్చరింగ్ సొల్యూషన్
సి) ‘రోబోట్స్ ఎలైవ్’ కంపెనీ
డి) ASIMOV రోబోటిక్స్ ప్రై.లి

*7)చైనా ఇటీవల అంతరిక్షంలోనికి విజయవంతంగా* *ప్రయోగించిన మొదటి* *రవాణా అంతరిక్ష నౌక ఏది?*
ఎ) టియన్ జౌ-2
బి) టియన్ జౌ-1
సి) టియన్ గాంగ్-1
డి) టియన్ గాంగ్-2

*8) మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఎ.పి.జె అబ్దుల్ కలాం గౌరవర్దం నాసా ఒక కొత్త బాక్టరీయా జాతికి ఆయన పేరును పెట్టింది అది ఏది ?*
ఎ) కొరైనో బాక్టీరియం
బి) కలామై అబ్దులెన్సిస్
సి) సొలిబాసిల్లస్ కలామై
డి) బాసిల్లస్ కలామై

*9) నాలుగు టన్నుల బరువు మోయగలిగేలా ఇస్రో తయారు చేసిన అత్యంత బరువైన రాకెట్ ప్రయోగం ఇటీవల విజయవంతమైంది ఆ రాకెట్ పేరేమిటి ?*
ఎ) GSL-MK I
బి) GSLV-MK III
సి) GSLV-MK II
డి) GSLV-MK IV

*10) ఎర్త్ డే-2017 నినాదం ఏమిటి ?*
ఎ) ఎన్విరాన్ మెంటల్ అండ్ క్లైమేట్ లిటరసీ
బి) ఎర్త్ అండ్ క్లైమేట్ చేంజ్
సి) ఎర్త్ అండ్ ఎన్విరాన్ మెంటల్ డెవలప్ మెంట్
డి) ఎన్విరాన్ మెంటల్ అండ్ ఎర్త్ ప్రొటెక్షన్

*11) 2017 ప్రపంచ జీవవైవిధ్య దినోత్సవం ముఖ్య ఉద్దేశం ఏమిటి ?*
ఎ) బయోడైవర్సీటి అండ్ సస్టైనబుల్ వెల్త్
బి) బయోడైవర్సీటి అండ్ సస్టైనబుల్ టూరిజం
సి) బయోడైవర్సీటి అండ్ హ్యూమన్ హెల్త్
డి) బయోడైవర్సీటి అండ్ సస్టైనబుల్ ఇండస్ట్రియలైజేషన్

*12) 5000 కి.మీ దూరంలోని లక్ష్యసాధన కోసం రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ తయారు చేసిన క్షివణి ?*
ఎ) అగ్ని - IV
బి) అగ్ని - III
సి) అగ్ని -V
డి) అగ్ని - I

*13) ధ్వని వేగం కన్నా అధిక వేగం (సూపర్ సోనిక్) గల బ్రహ్మోస్ ను ఇండియా ఏ దేశం తో కలసి అభివృద్ధి పర్చింది ?*
ఎ) ప్రాన్స్
బి) అమెరికా
సి) జర్మనీ
డి) రష్యా

*14) 290 కి.మీ లక్ష్య పరిధి కలిగి, ధ్వని కన్నా రెండు రెట్లు వేగంగా 14 కి.మీ పైకి ఎగురగల సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి ?*
ఎ) అగ్ని
బి) త్రిశూల్
సి) బ్రహ్మోస్
డి) వజ్ర

*15) దేశీయంగా DRDO నిర్మించిన పైలెట్ రహిత విమానం ?*
ఎ) ఇంద్ర
బి) లక్ష్య
సి) అగ్ని
డి) వరుణ

*16) యాంత్రిక శక్తి విద్యుత్ శక్తిగా దేనిలో మారుతుంది ?*
ఎ) జనరేటర్
బి) ఎలక్ట్రిక్ మోటర్
సి) ట్రాన్స్ ఫార్మర్
డి) పైవేమి కావు

*17) మోటర్ వాహనాల వేగాన్ని కోలిచే సాధనం ?*
ఎ) హైగ్రోమీటర్
బి) స్పీడోమీటర్
సి) క్రోనోమీటర్
డి) సోనోమీటర్

*18)జాతీయ సాంకేతిక విజ్ఞాన దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఏ రోజున నిర్వహిస్తారు ?*
ఎ) మే 21
బి) మే 11
సి) జులై 14
డి) మే 10

*19) కింది ప్రవచనాల్లో సరైంది ఏది ?*
ఎ) వస్తువు చలనానికి వ్యతిరేక దిశలో ఘర్షణ పని చేస్తుంది
బి) గాలి వల్ల కలిగే ఘర్షణ ను ‘స్నిగ్ధత’ అంటారు
సి) సైకిల్ చక్రంపై పని చేసే ఘర్షణ, సైకిల్ చలన దిశలో పనిచేస్తుంది
డి) సైకిల్ చక్రంపై పని చేసే ఘర్షణ, సైకిల్ చలన వ్యతిరేక దిశలో పనిచేస్తుంది
ఎ) బి మాత్రమే
బి) ఎ మాత్రమే
సి) ఎ.బి.సి
డి) ఎ.బి.డి

*20) స్వేచ్చగా కింద పడే వస్తువు దేన్ని కలిగి ఉండదు ?*
ఎ) ద్రవ్యరాశి
బి) త్వరణం
సి) భారం
డి) వేగం

*21) చలించే ఆవేశం దేన్ని ఏర్పరుస్తుంది ?*
i) విద్యుత్ క్షేత్రం
ii) అయస్కాంత క్షేత్రం
iii) 1,2
iv) ఏదీకాదు
ఎ) i మాత్రమే
బి) ii మాత్రమే
సి) iv మాత్రమే
డి) iii మాత్రమే

*22) పదార్థంలోని లోపాలను గుర్తించే అవినాశక పద్దతి (Non-destructive method) ప్రయోగంలో ఏ శక్తి స్వరూపాన్ని ఉపయోగిస్తారు ?*
ఎ) ధ్వని
బి) విద్యుత్
సి) ఉష్ణం
డి) అయస్కాంత

*23) కింది ప్రవచనాలను చదివి, సరైన సమాధానాన్ని గుర్తించండి ?*
ఎ) ఉత్తేజిత కంపన శక్తి స్థాయిలో ఉండే యానకం అణువుల వల్ల కలిగే కాంతి పరిక్షేపణంతో
రామన్ ప్రభావం ముడిపడింది
బి) నిత్యత్వ నియమం నిరూపించడానికి వీలులేని ఒక పరికల్పన, కానీ ప్రమోగాల ద్వారా దాన్ని
నిర్థారించవచ్చు
సి) ఖగోళ, భౌగోళిక ప్రదేశాల్లో ఒకే గమన, గురుత్వ సూత్రాలను అనువర్తించలేమని న్యూటన్
నిరూపించాడు
ఎ) బి.సి సరైనవి కానీ ఎ తప్పు
బి) ఎ తప్పు బి.సి సరైనవి
సి) ఎ.బి సరైనవి కానీ సి తప్పు
డి) ఎ.సి సరైనవి కానీ బి తప్పు

*24) *ప్రతిపాదన (A)*  *విద్యుత్ మోటర్ యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తి గా మారుస్తుంది*
*కారణం (R)* *విద్యుత్ మోటర్ అన్యోన్య ప్రేరకత్వం పై ఆధారపడి పని చేస్తు్ంది*
ఎ) A, R రెండు తప్పు
బి) A, R రెండు నిజం, A కి R సరైన వివరణ
సి) A, R రెండు నిజం, A కి R సరైన వివరణ కాదు
డి) A నిజం కాని R తప్పు

*25) సగం వరకు నీటిలో నింపిన పాత్ర పై భాగాన్ని మూసి వేశారు. పై భాగానికి చేసిన రంధ్రం ద్వారా గాలిని బయటకు తోడేస్తే....*
ఎ) నీటి సాంద్రత తగ్గుతుంది
బి) నీటి తలం వద్ద పీడనం తగ్గుతుంది
సి) పాత్రలో నీటి మట్టం పెరుగుతుంది
డి) పాత్ర అడుగున నీరు కలిగించే బలం (ఒత్తిడి) తగ్గుతుంది
ఎ) బి.డి
బి) బి.సి
సి) బి.సి.డి
డి) ఎ.డి

♦️జవాబులు♦️
1)ఎ  (2)బి  (3)సి  4)డి 5)బి
 (6)బి  (7)బి  (8)సి (9)బి  (10)ఎ  
(11)బి  (12)సి  (13)డి  (14)సి  (15)బి  
(16)ఎ (17) బి  (18)బి  (19) సి (20)సి  
(21)డి   (22) సి (23)సి  (24)ఎ   (25)ఎ.