హోల్ సెల్ వ్యాపారం చేయాలనీ ఉందా... లక్షల్లో పెడితే కోట్లలో లాభాలు కందిపప్పు వ్యాపారం

కందిపప్పు వ్యాపారం,  కందిపప్పు ఎక్కడ హోల్ సేల్ గా దొరుకుతుంది ఎలా మనం అమ్మకాలు చేయాలి అనే విషయాలు ఈ రోజు  తెలుసుకుందాం .
                              
హోల్ సెల్  వ్యాపారాలలో ఇది చాలా మంచి వ్యాపారం. కందిపప్పును మనం  హోల్సేల్ గా కొని హోల్సేల్గా షాపులకు విక్రయించడం. కంది పంట పండే రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్  మూడో స్థానంలో ఉంది ఇక్కడ చాల ఎక్కువగా కంది సాగు చేస్తున్నారు కానీ మనము రైతుల నుండి కంది పంటను కొనలేము ఎందుకంటే కందులను ప్రాసెసింగ్ చేసి బేడలను తయారు చేయడానికి  పెద్ద పెద్ద dal mills అవసరము ఉంటాయి సాధారణంగా  రైతులు డైరెక్టుగా ఈ కంది పంటను  ఫుడ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా  అంటే (ఎఫ్. సి . ఐ ) వాళ్లకు అమ్మేస్తారు  వారి వద్ద  నుండి పెద్ద పెద్ద డాల్ మిల్స్ వాళ్లు బీడ్ వేసి ఈ కందులను కొనుగోలుచేస్తారు . ఆ మిల్లులు కందులు కొనుగోలు చేసి కంది పప్పుగా మార్చి మనకు అమ్ము తుంటారు