How to start Security Agency in India Low Invest High Profit New Business Idea Telugu Self Employment

ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒక్క ప్రదేశంలో అవసరమైన వ్యక్తి సెక్యూరిటీ గార్డ్స్. ఆసుపత్రిలో, స్కూల్స్ లో, కాలేజీలో, ఆఫీసులో ఇలా ఎక్కడికి వెళ్లినా మొదటగా కనిపించే వ్యక్తి సెక్యూరిటీ గార్డు. ప్రస్తుత ప్రపంచంలో ఈ సెక్యూరిటీ గార్డులకు మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా వీరి అవసరం పట్టణాల్లో నగరాల్లో విపరీతంగా అవసరమవుతోంది. ఈ అవసరాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనము సెక్యూరిటీ ఏజెన్సీని స్థాపించి సెక్యూరిటీ గార్డులను తయారుచేసి ఇవ్వడం ద్వారా తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను సులభంగా సంపాదించుకోవచ్చు.
ముందుగా సెక్యూరిటీ ఏజెన్సీ స్థాపించాలంటే ముఖ్యంగా కొన్ని అనుమతులు తప్పనిసరి. ఏ అనుమతులు కావాలనే విషయానికి వస్తే ముఖ్యంగా ఫసారా లైసెన్స్, ఇంకా ఈపీఎఫ్, ఈ ఎస్ ఐ, ఇంకా గవర్నమెంట్ కు సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ కచ్చితంగా అవసరం అవుతాయి. .