పెట్టుబడి రూ.3999... నెలకు ఆదాయం రూ.80,000... బిజినెస్ ఐడియా ఇదే

తక్కువ పెట్టుబడితో ఏదైనా మంచి వ్యాపారం చేద్దామనుకుంటున్నారా? ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. ఐఆర్‌సీటీసీ ఏజెంట్‌గా సేవలు అందిస్తే నెలకు వేలల్లో ఆదాయం పొందొచ్చు. 
కేవలం రూ.3,999 ఉంటే చాలు... రైల్వే టికెట్ బుకింగ్ ఏజెంట్‌గా మారొచ్చు. ఐఆర్‌సీటీసీ కల్పిస్తున్న అవకాశమిది. ఐఆర్‌సీటీసీ ద్వారా కోట్లాది మంది నిత్యం రైల్వే టికెట్లు బుక్ చేస్తుంటారు. ఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్ ద్వారా మీరూ డబ్బు సంపాదించొచ్చు. ఇందుకోసం మీరు ఐఆర్‌సీటీసీ ఆథరైజ్డ్ టికెట్ బుకింగ్ ఏజెంట్‌గా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని ద్వారా మీకు నెలకు ఆదాయం లభిస్తుంది. మరి ఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్ ఏజెంట్‌‌లు ఎలాంటి సేవలు అందించొచ్చు? ఎలాంటి లాభాలు ఉంటాయి?  అనే పూర్తి విషయాలు ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం