కేవలం రూ. 50 వేల పెట్టుబడితో నెలకు రూ.40 వేల ఆదాయం పొందండిలా...

ఆలోచన ఉండాలే కానీ మన చుట్టూ ఉన్న ప్రతీ అవసరాన్ని మనం ఆదాయ వనరుగా మలచుకోవచ్చు.
ప్రపంచంలో  తక్కువ ఇన్వెస్ట్ మెంట్ తో ప్రతీ సీజన్, ప్రతీ రోజు, ప్రతీ క్షణం, ప్రతీ ప్రాంతంలోనూ గిరాకీ ఉన్న ఎక్కువ లాభాలు ఆర్జించే బిజినెస్(Business) ఉందంటే అది ఫుడ్ బిజినెస్ అనే చెప్పవచ్చు.   అయితే ఇందుకు ఒక ప్రణాళిక ఉండాలి. అప్పుడే ఫుడ్ బిజినెస్ లో విజయం సాధించగలం. 

ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో ప్రజలు తమతమ పనులను కూడా సరిగ్గా చేసుకోలేకపోతున్నారు. ఇంట్లో వంట దగ్గర నుంచి ప్రతి ఆహార వస్తువును బయటే కొనుగోలు చేస్తున్నారు. అందువలన రెడీమేడ్ ఆహారపు వస్తువులను మనం అందిస్తే మనం చక్కటి స్వయం ఉపాధిని పొందొచ్చు. అయితే ఈ రోజు మనం "ఇడ్లి పిండి అండ్ మిల్క్ పాయింట్" గురించి తెలుసుకుందాం.  అతి తక్కువ పెట్టుబడితో ఈ వ్యాపారం చేసే వీలుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు, యువత ఈ వినూత్న ఐడియాను అందిపుచ్చుకుంటే చక్కటి ఉపాధి అవకాశమవుతుంది.