How to Start Radium Stickering Business Telugu Self Employment Small Business Ideas

కొన్ని వ్యాపారాలకు మాత్రం తక్కువ శ్రమ, తక్కువ పెట్టుబడి, తక్కువ మార్కెటింగ్ అవసరం అవుతాయి. అలాంటి ఒక వ్యాపారమే "రేడియం స్టిక్కరింగ్ బిజినెస్" అసలేంటీ రేడియం స్టిక్కరింగ్ బిజినెస్..అంటే ? ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం రండి.
సహజంగా ఎవరైనా ఒక బైక్ ని కానీ కారు ని కానీ కొనుక్కుంటే  అవి అందంగా కనబడడానికి పలు రకాలైన మెరుగులు దిద్దుతారు . కొంతమంది అయితే వాహనాల మీద సినీ నటులు బొమ్మలు వేయిస్తుంటారు, మరి కొంతమంది దేవుళ్ళ బొమ్మలు వేయిస్తుంటారు. ఇక ఆటోవాలా అయితే తమ ఆటోల మీద ఏదో కొటేషన్ రాయించకుండా మాత్రం వదలరు.