మహిళలు ఇంట్లో కూర్చుని చేసే వ్యాపారం | Ladies Face Stickers Business Self Employment Ideas in Telugu

మనదేశంలో డిమాండ్ తగ్గని వ్యాపారం ఏదైనా ఉంది. అంటే అది మహిళల అలంకరణకు సంబంధించిన వస్తువుల వ్యాపారమే. ముఖ్యంగా మన భారతీయ మహిళలు అలంకరణ ప్రియులు కావడంతో వారికి సంబంధించిన ఏ వస్తువుకైనా మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది.

కాబట్టి ఇలాంటి అలంకరణ వస్తువులను తయారు చేసి వ్యాపారం చేసినట్లయితే మనం చక్కటి సంపాదన పొందడానికి అవకాశం ఉంది. భారతీయ మహిళ అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది నుదిటి మీద బొట్టు మహిళలు నిత్యం నుదిటిన బొట్టు పెట్టుకుంటారు. అందువలన వీటికి మార్కెట్లో ఎప్పటికీ డిమాండ్ తగ్గదు. కాబట్టి ఈ నుదుటి బొట్టుల తయారీని మనం వ్యాపార మార్గంగా ఎంచుకుని స్వయం ఉపాధి పొందవచ్చు.