1. కిందివాటిలో వ్యతస్థబంధ పాలిమర్ ఏది?
1) పాలిథీన్
2) పీవీసీ
3) బేకలైట్
4) నైలాన్
జవాబు : 3
2. పేదవాడి పట్టు (కృత్రిమ పట్టు) అని దేన్నిఅంటారు?
1) నైలాన్
2) టెరిలీన్
3) రేయాన్
4) పెర్లాన్
జవాబు : 3
3. ఆటవస్తువులు, గృహోపకరణాలు, ప్రయోగశాలపరికరాల తయారీలో వాడే ప్లాస్టిక్లు?
1) అల్ప సాంద్రత పాలిథీన్
2) టెఫ్లాన్
3) అధిక సాంద్రత పాలిథీన్
4) రేయాన్
జవాబు : 3
4. రేడియో, టెలివిజన్ కేబినెట్లను తయారు చేయడానికి ఉపయోగించే పాలిమర్?
2) పాలి స్టెరీన్
3) నైలాన్
4) రేయాన్
జవాబు : 2
5. నూలుకు ప్రత్యామ్నాయంగా టెన్నిస్ రాకెట్లు,సైకిల్ ఫ్రేములు, చేపలు పట్టడానికి ఉపయోగించే రాడ్లు లాంటి వాటి తయారీలో ఉపయోగించే పాలిమర్ ఏది?
2) పీవీసీ
3) పాలి ఎకైలో నైటైల్
4) సహజ రబ్బరు
జవాబు : 3
6. ఫొటోగ్రాఫిక్ ఫిల్మ్ తయారీకి ఉపయోగించే సెల్యులాయిడ్లు ఏ ముడిపదార్థాల నుంచి తయారుచేస్తారు?
2) నత్రికామ్లం
3) సెల్యులోజ్
4) అన్నీ
జవాబు : 4
7. భూమి మీద అత్యధికంగా లభించే పాలీమర్ ఏది?
1) పాలిథీన్
2) సెల్యులోజ్
3) నైలాన్
4) కెప్లెర్
జవాబు : 2
8. సహజ రబ్బరు గట్టిదనం పెంచడానికి చేసే వల్కనైజేషన్ ప్రక్రియలో ఉపయోగించే కారకం?
1) గ్రాఫైట్
2) సల్పర్
3) ఫాస్పరస్
4) పొటాషియం
జవాబు : 2
9. కిందివాటిలో కృత్రిమ రబ్బరు?
1) నియోక్రీన్
2) స్టెరీన్ బ్యూటాడైయీన్ రబ్బరు
3) నైట్రైల్ రబ్బరు
4) అన్ని
జవాబు : 4
10. కన్వేయర్ బెల్టులు, గాస్కెట్ల తయారీలో ఉపయోగించే పాలిమర్?
1) నియోక్రీన్
2) నైలాన్
3) బేకలైట్
4) టెఫ్లాన్
జవాబు : 1
11. వాహనాల టైర్లు, పాదరక్షల భాగాలు తయారుచేయడానికి వాడే పాలిమర్?
1) నియోక్రీన్
2) బ్యునా-S
3) స్టెరీన్ బ్యూటాడైయీన్ రబ్బరు
4) 2, 3
జవాబు : 4
12. తొడుగులు (Gloves), ఆయిల్ సీల్లు,హౌస్ పైపులను తయారుచేసేందుకు ఉప యోగించే పాలిమర్?
1) బ్యునా-S
2) బ్యునా-N
3) నైట్రైల్ రబ్బరు
4) 2, 3
జవాబు : 4
13. నియోప్రేన్ అనే కృత్రిమ రబ్బరు యొక్క మోనోమర్ ఏది?
1) క్లోరోఫ్రీన్
2) స్టెరీన్
3) ఎకైలో నైటైల్
4) ఈథేన్
జవాబు : 1
14. రక్తం ప్లాస్మా రూపంలో ప్రాణ రక్షణ పదార్థంగా పనిచేసే పాలిమర్?
1) బేకలైట్
2) బ్యునా-N
3) పాలి వినైల్ పిరోలిడోన్
4) బ్యునా-S
జవాబు : 3
1) నైలాన్
2) పాలి మిథైల్ మిథాక్రియేట్
3) టెరిలీన్
4) టెఫ్లాన్
జవాబు : 2
16. కృత్రిమ పోగులను (దారాలు) వేటి నుంచి తయారు చేస్తారు?
1) నైలాన్ - 6
2) నైలాన్ - 6, 6
3) టెరిలీన్
4) అన్నీ
జవాబు : 4
17. కిందివాటిలో పాలిఎమైడ్?
1) నైలాన్ - 6
2) నైలాన్ - 6, 6
3) టెరిలీన్
4) 1, 2
జవాబు : 4
18. టెరిలీన్ అనేది ఒక?
1) పాలిఅడ్
2) పాలిఎస్టర్
3) పాలిఈథర్
4) పాలిఆక్సైడ్
జవాబు : 2
19. నైలాన్ - 6, 6 తయారీలో ఉపయోగించే ముడిపదార్థాలు?
1) ఎడిపిక్ ఆమ్లం
2) హెక్టా మిథిలీన్ డైఅమైన్
3) ఇథిలీన్ గ్లైకాల్
4) 1, 2
జవాబు : 4
20. పాలి ఇథిలీన్ టెరిస్తాలేట్ (PET) పాలిమర్ సాధారణ నామం?
1) టెరిలిన్
2) డెక్రాన్
3) 1, 2
4) పెర్లాన్
జవాబు : 3
21. టెరిలీన్ తయారీలో ఉపయోగించే ముడిపదార్థాలు ఏవి?
1) ఇథిలీన్ గ్లైకాల్
2) టెరిఫాలిక్ ఆమ్లం
3) 1, 2
4) ఎడిపిక్ ఆమ్లం
జవాబు : 3
22. టూత్ బ్రష్ వెంట్రుకల తయారీ (Britles)లో
1) నైలాన్ - 6
2) నైలాన్ - 6, 6
3) పాలిథీన్
4) టెఫ్లాన్
జవాబు : 2
23. ప్రయోగశాలలో ఉపయోగించే సురక్షిత కళ్లజోళ్లు, సీడీ, డీవీడీ, బుల్లెట్ ప్రూఫ్ కిటికీలు, రక్షణ హెల్మెట్ల తయారీలో వాడే ప్లాస్టిక్ ఏది?
1) పాలికార్బోనేట్
2) నైలాన్
3) పాలిఅమైడ్
4) ఏదీకాదు
జవాబు : 1
24, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల తయారీలో ఉపయోగించే ప్లాస్టిక్?
1) నైలాన్
2) డెక్రాన్
3) కెప్లెర్
4) టెఫ్లాన్
జవాబు : 3
25. ఫీనాల్, ఫార్మాలి హైడ్ నుంచి తయారుచేసే పాలిమర్ ఏది?
1) నైలాన్
2) బేకలైట్
3) గ్లిష్టాల్
4) పాలికార్బొనేట్
జవాబు : 2
26. లామినేషన్ చేయడంలో ఉపయోగించే పాలిమర్?
1) బేకలైట్
2) టెరిలీన్
3) పాలికార్బోనేట్
4) పాలిథీన్
జవాబు : 1
27. పగలని పింగాణి వస్తువుల తయారీలో ఉపయోగించే పాలిమర్?
1) యూరియా - ఫార్మాల్డి హైడ్ రెజిన్
2) మేలమైన్ - ఫార్మాల్డిహైడ్ రెజిన్
3) ఫీనాల్ - ఫార్మాల్డిహైడ్ రెజిన్
4) నైలాన్ - 6, 6
జవాబు : 2
28. కూల్డ్రింక్ బాటిల్స్ తయారీలో ఉపయోగించే ప్లాస్టిక్?
1) పాలి ఇథిలీన్ టెరిఫ్తాలేట్
2) పీవీసీ
3) బేకలైట్
4) పాలీకార్బొనేట్
జవాబు : 1
0 Comments
కామెంట్‌ను పోస్ట్ చేయండి