➤ 1885 డిసెంబర్ 28న భారత జాతీయ కాంగ్రెస్ ను స్థాపించారు
➤ 1885 - 1905 మధ్య కాలాన్ని మితవాడ దశగా పేర్కొంటారు
➤ 1905 - 1920 మధ్య కాలాన్ని అతివాద దశగా పేర్కొంటారు
➤ 1905 జూలై 20న బెంగాల్ విభజన ప్రకటన వెలువడింది
➤ 1906 డిసెంబర్ 31న ముస్లిం లీగ్ పార్టీని స్థాపించారు.
➤ 1907లో సూరత్తో కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఈ సమీవేశంలో కాంగ్రెస్ నాయకులు మితవాదులు, అతివాదులుగా విడిపోయారు
➤ 1908 ఏప్రిల్ 30న ఖుదీరాంబోసను ఉరి తీశారు
➤ 1909 మే 21న మింటోమార్లే సంస్కరణలను ప్రవేశ పెట్టారు. ➤ 1911లో బెంగాల్ విభజనను రద్దు చేశారు
➤ 1912లో రాజధానిని కోల్ కతా నుంచి ఢిల్లీకి మార్చారు
➤ 1913 నవంబరు 1న శాన్ ఫ్రాన్సిస్కోలో గదర్ పార్టీని స్థాపించారు
➤ 1914-1918 మధ్య కాలంలో మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది
➤ 1915 జనవరిలో గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి భారత్ కు తిరిగి వచ్చారు
➤ 1916లో గాంధీజీ సబర్మతి ఆశ్రమాన్ని స్థాపించారు
➤ 1915 ఫిబ్రవరి 19న గోపాలకృష్ణ గోఖలే మరణించారు
➤ 1916లో లఖ్ నవూ (లక్నో) ఒడంబడిక జరిగింది
➤ 1916లో హోమ్ రూల్ ఉద్యమం ప్రారంభమైంది
➤ 1917లో చంపారన్ సత్యాగ్రహం జరిగింది
➤ 1917లో అనిబిసెంట్ భారత జాతీయ కాంగ్రెస్ కు తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.
➤ 1918 అహ్మదాబాద్లో నూలు మిల్లుల సందర్శన జరిగింది
➤ 1919లో ఖిలాఫత్ ఉద్యమం ప్రారంభమైంది
➤ 1919 ఏప్రిల్ 6న రౌలట్ చట్టం చేశారు. ➤ 1919 ఏప్రిల్ 13న జలియన్ వాలాబాగ్ ఉదంతం చోటుచేసుకుంది
➤ 1919లో హంటర్ కమిషన్ ఏర్పాటైంది
➤ 1919 డిసెంబరు 5న మాంటేగ్ ఛేమ్స్ ఫర్డ్ సంస్కరణలను ప్రకటించారు
➤ 1920లో బాలగంగాధర తిలక్ మరణించారు.
➤ 1920లో ఎం.ఎన్. రాయ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాను స్థాపించారు
➤ 1920 - 1947 మధ్య కాలాన్ని గాంధీజీ దశగా పేర్కొంటారు.
➤ 1920 -22 మధ్య సహాయ నిరాకరణోద్యమం జరిగింది.
➤ 1922 ఫిబ్రవరి 5న చౌరీ చౌరా ఉదంతం చోటుచేసుకుంది
➤ 1922లో కేరళలో మోప్లాల తిరుగుబాటు జరిగింది
➤ 1923లో స్వరాజ్ పార్టీని స్థాపించారు
➤ 1925లో కకోరీ కుట్ర కేసు నమోదైంది.
➤ 1927లో బట్లర్ కమిషన్, సైమన్ కమిషన్లను ఏర్పాటుచేశారు
➤ 1928లో మోతీలాల్ నెహ్రూ ఒక రిపోర్ట్ ను రూపొందించారు
➤ 1928లో లాలాలజపతిరాయ్ మరణించారు.
➤ 1928లో చంద్రశేఖర్ ఆజాద్ హిందూస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ ను స్థాపించారు
➤ 1929 ఏప్రిల్ 8న భగత్ సింగ్, భతుకేశ్వర్ దత్ ఢిల్లీలోని అసెంబ్లీపై బాంబులు వేశారు
➤ 1929 డిసెంబరు 31న లాహోర్ లో జరిగిన కాంగ్రెస్ సమావేశానికి నెహ్రూ అధ్యక్షత వహించారు➤ 1929లో శారదా వివాహ చట్టాన్ని రూపొందించారు
➤ 1929 అక్టోబరు 31న భారత్ కు డొమినియన్ ప్రతిపత్తి కల్పించారు
➤ 1930 మార్చి 12న ఉప్పు సత్యాగ్రహం జరిగింది
➤ 1930 నవంబరు 30న మొదటి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
➤ 1931 ఫిబ్రవరి 27న చంద్రశేఖర్ ఆజాద్ ఎన్ కౌంటర్ జరిగింది
➤ 1931 మార్చి 23న భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లను ఉరి తీశారు.
➤ 1931 సెప్టెంబరు 7న రెండో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది
➤ 1932 నవంబరు 17న మూడో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
➤ 1931 మార్చి 5న గాంధీ ఇర్విన్ ఒప్పందం కుదిరింది
➤ 1932 ఆగస్టు 16న కమ్యూనల్ అవార్డును ప్రకటించారు.
➤ 1932లో పూనా ఒడంబడిక జరిగింది.
➤ 1935లో భారత ప్రభుత్వ చట్టాన్ని రూపొందించారు.
➤ 1937లో 1935 చట్టం ప్రకారం ఎన్నికలు జరిగాయి.
➤ 1939లో త్రిపురలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో సుభాష్ చంద్రబోస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో భోగరాజు పట్టాభి సీతారామయ్య ఓడిపోయారు.
➤ 1939 - 45 మధ్య కాలంలో రెండో ప్రపంచయుద్ధం జరిగింది.
➤ 1939లో నేతాజీ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించారు.
➤ 1939 కాంగ్రెస్ మంత్రివర్గాలు రాజీనామా చేశాయి.
➤ 1940 ఆగస్టు 10న ఆగస్టు ప్రతిపాదనలకు సంబంధించిన ప్రకటన వెలువడింది
➤ 1940 అక్టోబరు 17న వ్యక్తి సత్యాగ్రహ ఉద్యమం ప్రారంభమైంది
➤ 1942 మార్చి 11న క్రిప్స్ రాయబారం
➤ 1942 ఆగస్టు 8న క్విట్ ఇండియా ఉద్యమం మొదలైంది.
➤ 1946 క్యాబినెట్ మిషన్ ప్రణాళికను రూపొందించారు.
➤ 1946లో నెహ్రూ అధ్యక్షతన తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది.
➤ 1947 మార్చి 24న మౌంట్ బాటన్ గవర్నర్ జనరల్ గా నియమితులయ్యారు.
➤ 1947 ఆగష్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది
0 Comments
కామెంట్‌ను పోస్ట్ చేయండి