భారతదేశ సరిహద్దు దేశాలు

భారతదేశ భూ సరిహద్దు పొడవు 15200 కి.మీ. భారతదేశం 7 దేశాలతో అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉంది.
- భారతదేశంతో సరిహద్దు కలిగి ఉన్న దేశాలు : చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్, భూటాన్.
- భారతదేశంతో ఎక్కువ భూ సరిహద్దు కలిగిన దేశం - బంగ్లాదేశ్.
- భారతదేశంతో తక్కువ భూ సరిహద్దు కలిగిన దేశం - ఆఫ్ఘనిస్తాన్.
- భారత్ లో 17 రాష్ట్రాలు అంతర్జాతీయ భూ సరిహద్దు కలిగి ఉన్నాయి.
- బంగ్లాదేశ్ తో సరిహద్దు కలిగిన భారత రాష్ట్రాలు - ఆస్సోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, త్రిపుర, మిజోరం.
- చైనా తో సరిహద్దు కలిగిన భారత రాష్ట్రాలు - సిక్కిం, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్, అరుణాచల్ ప్రదేశ్.
- పాకిస్తాన్ తో సరిహద్దు కలిగిన భారత రాష్ట్రాలు -జమ్మూ కాశ్మీర్, గుజరాత్, రాజస్తాన్, పంజాబ్.
- నేపాల్ తో సరిహద్దు కలిగిన భారత రాష్ట్రాలు - ఉత్తర ప్రదేశ్, ఉత్తరాంచల్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం.
- మయన్మార్ తో సరిహద్దు కలిగిన భారత రాష్ట్రాలు - నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరం.
- భూటాన్ తో సరిహద్దు కలిగిన భారత రాష్ట్రాలు - అరుణాచల్ ప్రదేశ్, అసోం, పశ్చిమ బెంగాల్, సిక్కిం.
- ఆఫ్ఘనిస్తాన్ తో సరిహద్దు కలిగిన భారత రాష్ట్రాలు - జమ్మూ కాశ్మీర్.
0 Comments
కామెంట్‌ను పోస్ట్ చేయండి