ప్రధాన మంత్రి వయ వందన యోజన... నెలకు రూ.10,000 పెన్షన్ వచ్చే స్కీమ్

ప్రధాన మంత్రి వయ వందన యోజన... కేంద్ర ప్రభుత్వం 2017లో ప్రారంభించిన పెన్షన్ స్కీమ్ ఇది. ఈ స్కీమ్‌ లో పెట్టుబడి పెడితే నెలకు రూ.1,000, నుంచి రూ.10,000 వరకు పెన్షన్ పొందొచ్చు. పెన్షన్ ఎంత తీసుకోవాలి అనేదానిపై మీ పెట్టుబడి ఆధారపడి ఉంటుంది. ఈ పాలసీ తీసుకోవాలంటే ఆధార్ నెంబర్ తప్పనిసరి.

  • కనీస వయస్సు- 60 ఏళ్లు
  • గరిష్ట వయస్సు- గరిష్ట పరిమితి లేదు
  • పాలసీ గడువు- 10 ఏళ్లు
  • కనీస పెన్షన్- నెలకు రూ.1,000.....
  • గరిష్ట పెన్షన్- నెలకు రూ.10,000
  • ఆన్‌లైన్‌లో తీసుకుంటే 30 రోజుల ఫ్రీ లుక్ పీరియడ్ ఉంటుంది.

ప్రీమెచ్యూర్ ఎగ్జిట్- 10 ఏళ్ల గడువు పూర్తికాకముందే పాలసీ వద్దనుకుంటే మీరు ఇన్వెస్ట్ చేసిన దాంట్లో 98% మాత్రమే వెనక్కి వస్తుంది.

దీనికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఈక్రింది లింక్ పై క్లిక్ చేయండి: https://bit.ly/2SIjZGx